HomeMovie News Telugu'భాగమతి' లేడీ జేమ్స్‌ బాండ్‌'

‘భాగమతి’ లేడీ జేమ్స్‌ బాండ్‌’

‘ఇది భాగమతి అడ్డా..’ అంటూ ‘భాగమతి’ టీజర్‌తో భయపెట్టిన అనుష్క ఇప్పుడు స్టైలిష్‌ అండ్‌ గ్లామరస్‌ లుక్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ‘భాగమతి’ ప్రమోషన్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు మరింత స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. 

‘భాగమతి’ టైటిల్‌తో సాగే ఈ వీడియో సాంగ్‌ని ప్రత్యేకంగా చిత్రీకరించారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో అందాల భామలు డాన్స్‌ చేస్తుంటే, అక్కడక్కడా అనుష్క స్టైలిష్‌గా కాళ్లు కదపడం చాలా బాగుంది. హాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్‌ సినిమాలకు టైటిల్‌ సాంగ్స్‌ హైలైట్స్‌ అవుతాయి. బ్యాక్‌ గ్రౌండ్‌లో అందాల భామలు డాన్సులు చేస్తుంటే, జేమ్స్‌బాండ్‌ పాత్రధారి తనదైన శైలిలో కాలు కదపడం, గన్‌ పట్టుకుని, బిన్న భంగిమల్లో కనిపిస్తుండడం జరుగుతుంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. 

అలాగే ‘భాగమతి’ టైటిల్‌ సాంగ్‌ని కూడా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌లా బ్యాక్‌ గ్రౌండ్‌లో గ్రాఫిక్స్‌ లేవంతే. మధ్యలో సినిమా మేకింగ్‌ వీడియోని కూడా జత చేశారు ఈ టైటిల్‌ సాంగ్‌లో. దాంతో ఈ తాజా వీడియోకి మంచి స్పందన వస్తుంది. ఈ వీడియో చూశాక సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యిందనే చెప్పాలి. 

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని అశోక్‌ తెరకెక్కించారు. నానితో ‘పిల్లజమీందార్‌’ వంటి క్యాజువల్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించిన అశోక్‌ ‘భాగమతి’ వంటి స్టోరీని ఎలా డీల్‌ చేశాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో ఏం చూపించాడో తెలీదు కానీ, ప్రమోషన్‌ వీడియోలతోనే ప్రశంసలు దక్కించేసుకుంటున్నాడు డైరెక్టర్‌ అశోక్‌. 

ఇకపోతే సినిమాకి తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అతి పెద్ద హైలైట్‌ అని చెప్పాలి. టీజర్‌కిచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు తమన్‌. ఆలాగే ఆడియోలో ‘మందార, మందార..’ మెలోడీ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. సినిమా విషయానికి వస్తే సంచల అనే ఐపీఎస్‌ అధికారి పాత్రలో అనుష్క కనిపించనుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular