HomeMovie News Teluguసూపర్‌ స్టార్‌ స్పీడుకి హ్యాట్సాఫ్‌!

సూపర్‌ స్టార్‌ స్పీడుకి హ్యాట్సాఫ్‌!

తాను నటించిన సినిమాలు విడుదల ఆలస్యమవుతున్నా కానీ, సినిమాలకు సంబంధించిన కమిట్‌మెంట్‌లో ఏమాత్రం వేగం తగ్గడం లేదు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఆయన నటించిన ‘రోబో 2.0’ విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత రజనీ నటించిన మరో చిత్రం ‘కాలా’ కూడా రిలీజ్‌కి లైన్‌లోనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. 

డబ్బింగ్‌ సింగిల్‌ షాట్‌లో చెప్పడం రజనీకాంత్‌కి చాలా ఇష్టం. ఆందుకే ఆయన సినిమాలకు డబ్బింగ్‌ కార్యక్రమాలు ఫటా ఫట్‌ ధనా ధన్‌ అయిపోతుంటాయి. అయితే ఇంత వయసులోనూ డబ్బింగ్‌ చెప్పడంలో రజనీ స్పీడు చూసి చిత్ర యూనిట్‌ షాక్‌ అవుతోందట. గత చిత్రాల మాదిరిగానే, సూపర్‌ స్పీడుతో డబ్బింగ్‌ చెప్పేస్తున్నారట రజనీకాంత్‌. అందుకే ఆయన సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఇక పోతే కాలా విషయానికి వస్తే, మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్‌తో ‘కబాలి’ తెరకెక్కించిన పా రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఏప్రిల్‌లో ‘రోబో 2.0’ విడుదల కానుంది. శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘రోబో 2.0’ తర్వాత వీలైనంత త్వరలోనే ‘కాలా’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. మరోపక్క త్వరలోనే రజనీకాంత్‌ తన రాజకీయ పార్టీ పేరును అనౌన్స్‌ చేయనున్నారు. ఈలోగా సినిమాలకు సంబంధించిన బ్యాలెన్స్‌ వర్క్‌ ఏదీ ఉండకూడదనే చకచకా చక్కబెట్టేస్తున్నారట. రజనీకాంత్‌ స్పీడుకి ఇటు సినీ వర్గాలూ, అటు రాజకీయ వర్గాలూ కూడా ఆశ్చర్యపోతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular