HomeMovie News Teluguతమ్ముడి బాటలో అన్నయ్య - ఇది నిజమేనా?

తమ్ముడి బాటలో అన్నయ్య – ఇది నిజమేనా?

తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో సూర్య సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సూర్య సినిమాలు మంచి వసూళ్లే రాబడుతూ ఉంటాయి. అయినా కానీ ఇంతవరకూ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయలేదు సూర్య. 

సూర్య కంటే వెనక సినీ రంగంలోకి ప్రవేశించిన సూర్య సోదరుడు కార్తీ, కెరీర్‌ మొదట్లోనే తెలుగు లో స్ట్రెయిట్‌ సినిమా చేసి వావ్‌ అనిపించాడు. తెలుగులో కార్తి నటించిన ‘ఊపిరి’ సినిమా మంచి విజయం అందుకుంది. కార్తి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగు కుర్రాడిలానే కార్తీని స్వీకరించారు ఆ సినిమాతో. అయితే ఇప్పుడు సూర్య కూడా ఓ తెలుగు సినిమాలో నటించనున్నాడంటూ టాలీవుడ్‌ వర్గాల సమాచారం. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడు సూర్య కోసం స్క్రిప్ట్‌ తయారు చేశాడట. 

‘ఊపిరి’ సినిమాలో కార్తి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. అలాగే సూర్య కూడా డబ్బింగ్‌ చెప్పుకునేందుకు తెలుగు ప్రాక్టీస్‌ చేస్తున్నాడట. ఈ సినిమాని కంప్లీట్‌గా తెలుగులోనే తీయనున్నారట. తమిళంలో విడుదల చేయనున్నారట. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో నటించనున్నాడనీ సమాచారమ్‌. కార్తీ నటించిన ‘ఊపిరి’ సినిమాలో అక్కినేని నాగార్జున నటించాడు. మరో పక్క సూర్య హీరోగా వస్తున్న ‘గ్యాంగ్‌’ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular