HomeMovie News Teluguసూపర్‌స్టార్‌ కూతురు అదరగొట్టేసిందా?

సూపర్‌స్టార్‌ కూతురు అదరగొట్టేసిందా?

సూపర్‌స్టార్‌ కృష్ణ తనయ, మహేష్‌బాబు సోదరి అయిన మంజుల దర్శకురాలిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఈ సినిమా మొదట్నుంచీ ఆశక్తిని పెంచుతూనే ఉంది. సినిమా లొకేషన్స్‌, టేకింగ్‌ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయనీ ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తూ వచ్చింది. సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరిందట. సినిమా ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందని ఇన్‌సైడ్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. 

సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమాలో మనసుకు నచ్చి, గుర్తుండిపోయే సన్నివేశాలు చాలా ఉన్నాయట. కొన్ని లొకేషన్స్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు చాలా నేచురల్‌గా వచ్చాయట. ఆల్రెడీ విడుదలైన టీజర్‌ ప్రోమోస్‌ ద్వారా హీరోయిన్‌ అమైరా దస్తూర్‌ని చాలా అందంగా తెరపై చూపించినట్లు తెలుస్తోంది. హీరోగా సందీప్‌ కిషన్‌కి ఈ సినిమా మంచి సినిమా అవుతుందని సినీ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో నటిగా ‘ఆరెంజ్‌’, కావ్యాస్‌ డైరీ’ తదితర చిత్రాల్లో నటించింది మంజుల. నటన ఆమెకు సంతృప్తినివ్వలేదట. నిర్మాతగానూ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించింది. అవి కూడా ఆమెకు సంతృప్తినివ్వలేదట. దర్శకురాలిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమనీ చెబుతోంది. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని మంజుల నమ్మకం వ్యక్తం చేస్తోంది. అన్నట్లు ఈ సినిమా ద్వారా మంజుల కూతురు జాహ్నవి కూడా నటిగా పరిచయం అవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular