HomeMovie News Telugu2017లో 'బిగ్‌బాస్‌ 'కే 'జై' కొట్టారు

2017లో ‘బిగ్‌బాస్‌ ‘కే ‘జై’ కొట్టారు

2016లో ‘జనతా గ్యారేజ్‌’ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 2017లో ‘జై లవకుశ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇంతవరకూ యంగ్‌ స్టార్స్‌లో ఎవరూ చేయని ట్రిపుల్‌ రోల్‌లో నటించి సత్తా చాటాడు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌. తొలిసారిగా అన్నయ్య కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో ఎన్టీఆర్‌ నటించిన సినిమా ‘జై లవకుశ’. 

అయితే ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇదే టైంలో ఎన్టీఆర్‌ చేసిన బుల్లితెర మెగా గేమ్‌ షో ‘బిగ్‌బాస్‌’ ఎన్టీఆర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇంటి ఇంటికీ ఎన్టీఆర్‌ని దగ్గర చేసింది. ఏకంగా 72 రోజులు ఈ గేమ్‌ షో ద్వారా ఎన్టీఆర్‌ ఆడియన్స్‌కి పంచిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా ఇంతా కాదు. నిజానికి వారంలో రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్‌ ఈ షోలో కనిపించేవాడు. కానీ వారమంతా ఆ ఇంపాక్ట్‌ ఉండేది ప్రేక్షకుల్లో. అలా ఈ షోతో బుల్లితెర బిగ్‌బాస్‌ అయిపోయాడు ఎన్టీఆర్‌. ఆడించాడు, నవ్వించాడు, కవ్వించాడు, వంటలు చేసి కొత్త కొత్తగా ఆలరించాడు. అబ్బో ఒక్కటేమిటి ‘బిగ్‌బాస్‌’ షోతో ఎన్టీఆర్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్‌ అయిపోయాక ఆ షోని మర్చిపోలేక ఆడియన్స్‌ చాలా ఫీల్‌ అయ్యారు కూడా. అంతగా ఈ షో ద్వారా ఎన్టీఆర్‌ పాపులర్‌ అయిపోయాడు. 

ఇకపోతే సినిమా ‘జై లవకుశ’ విషయానికి వస్తే, ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్‌. మూడు పాత్రలూ ఒకదానికొకటి భిన్నమైనవే. అయితే ఆ మూడింట్లోనూ ‘జై’ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్న పిల్లాడి దగ్గర్నుంచీ, అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ‘జై’ పాత్రతో ఎన్టీఆర్‌ ట్రై చేసిన న్యూ అటెంప్ట్‌ అందర్నీ మెప్పించింది. అలా 2017లో ఎన్టీఆర్‌ ఓ పక్క ‘బిగ్‌బాస్‌’ షోతోనూ, మరో పక్క ‘జై లవకుశ’ సినిమాతోనూ డిఫరెంట్‌గా సత్తా చాటాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular