HomeMovie News Teluguవిజయ్‌ దేవరకొండ కోలీవుడ్‌ ఎంట్రీ

విజయ్‌ దేవరకొండ కోలీవుడ్‌ ఎంట్రీ

‘పెళ్లిచూపులు’తో హీరోగా తొలి హిట్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అనూహ్యంగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా విజయ్‌ దేవరకొండ గురించి చర్చ జరుగుతోంది. ఓ వైపు వరుస అవకాశాలు ఇంకో పక్క కొనసాగుతున్న ‘అర్జున్‌రెడ్డి’ మేనియా, విజయ్‌ దేవరకొండని నిత్యం వార్తల్లో ఉంచుతున్నాయి. 

తాజాగా విజయ్‌ ఖాతాలో ఓ భారీ ప్రాజెక్ట్‌ చేరింది. అది తమిళ సినిమా కావడం విశేషం. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్‌ రాజా, విజయ్‌ దేవరకొండతో ఓ తమిళ సినిమా నిర్మించబోతున్నాడు. ఆనంద్‌ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ అగ్ర హీరో విక్రమ్‌తో ‘ఇరుముగన్‌’ వంటి భిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించి, విమర్శకులతో ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఆనంద్‌ శంకర్‌తోనే విజయ్‌ హీరోగా, స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞాన్‌వేల్‌ రాజా సినిమాని నిర్మించబోతున్నాడు. 

ఇంకో పక్క విజయ్‌ దేవర కొండ నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘అర్జున్‌రెడ్డి’ని విక్రమ్‌ కొడుకు హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. తమిళ తెరపై తెలుగు హీరోలు సత్తా చాటేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా, అంతగా సక్సెస్‌ కావడం లేదు. హీరోయిన్స్‌ మాత్రం చాలామందే ఇక్కడి నుండి అక్కడికి వెళ్లి సక్సెస్‌ అయ్యారు. హీరోల విషయంలో ఇప్పటిదాకా ఉన్న ఈక్వేషన్స్‌ని బ్రేక్‌ చేసి, విజయ్‌ దేవరకొండ తమిళ సినిమాల్లోనూ సత్తా చాటేలానే ఉన్నాడు. 

తెలుగులో ప్రస్తుతం సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మహానటి’లో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ద్విభాషా చిత్రమే అనుకోవాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular