HomeMovie News Teluguఆ ఇద్దరు మెగాహీరోలు వచ్చేదప్పుడేనా!

ఆ ఇద్దరు మెగాహీరోలు వచ్చేదప్పుడేనా!

వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తొలిప్రేమ’. క్యూట్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘తొలిప్రేమ’ తరహా ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి బీభత్సమైన రెస్పాన్స్‌ వస్తోంది. 

లవర్‌ బోయ్‌లా వరుణ్‌ తేజ్‌ కటింగ్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి ఈ స్టిల్స్‌లో. అంతేకాదు, ట్రెండీ అండ్‌ మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు వరుణ్‌ ఈ సినిమాలో. హృద్యమైన ప్రేమకథ కాబట్టి, లవ్‌ మంత్‌లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. లవర్స్‌ డేని పురస్కరించుకుని ఫిబ్రవరి 9న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. రాశీఖన్నా ఈ సినిమాలో వరుణ్‌తో జత కడుతోంది.  

ఇదిలా ఉండగా, మరో మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్‌ – వినాయక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ కూడా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం మస్కట్‌లో చివరి రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. త్వరలోనే చివరి షెడ్యూల్‌ పూర్తి చేసి, సినిమాని ఫిబ్రవరిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. సేమ్‌ అదే డేట్‌కి అంటే ఫిబ్రవరి 9న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుందనీ తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్‌. ‘ఖైదీ’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి ఉన్నాడు వినాయక్‌. ఇటీవలే ‘జవాన్‌’తో సక్సెస్‌ అందుకున్నాడు సాయి ధరమ్‌. 

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు విడుదలైతే..చూడాలి మరి. మెగా ప్రిన్స్‌ లవ్‌స్టోరీనా! మెగా మేనల్లుడి మాస్‌ యాక్షనా!

You May Like This
- Advertisment -spot_img

Most Popular