HomeMovie News Teluguఅతిలోక సుందరిని మించిపోయే గ్లామర్‌

అతిలోక సుందరిని మించిపోయే గ్లామర్‌

అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చెప్పలేని క్రేజ్‌. ఎప్పటికీ ఆమె చాలా మందికి అతిలోకసుందరే. అయితే ఈ ముద్దుగుమ్మ బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుని బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. తాజాగా ఈ బ్యూటీకి జూనియర్‌ బ్యూటీ అయిన జాహ్నవి ఇప్పుడు హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. ఓ మలయాళ సినిమాకి హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘ధడక్‌’ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తోంది. సినిమా ఫస్ట్‌లుక్‌ ఫోటోలతోనే తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది అందంలో.

అయితే ఇంకా తొలి సినిమా రిలీజ్‌ కాకుండానే మీడియా అటెన్షన్‌ని సంపాదించేసింది ఈ బ్యూటీ. అందుకు కారణం అమ్మడు అక్షరాలా గ్లామర్‌ డోస్‌ పెంచేయడమే. జాహ్నవి హాట్‌ హాట్‌ దర్శనాలతో మీడియాని ఎట్రాక్ట్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ జాహ్నవి హాట్‌నెస్‌తో శృతి మించేస్తోంది అమ్మడి గ్లామర్‌కి బాలీవుడ్‌ షాక్‌ తింటోంది. ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుండీ అయితే ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయట. అయితే శ్రీదేవి ప్రస్తుతం సౌత్‌పై పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపట్లేదనీ సమాచారమ్‌. కానీ బాలీవుడ్‌ కన్నా సౌత్‌ ఇండస్ట్రీనే శ్రీదేవికి ఎక్కువ బ్రహ్మరథం పట్టింది. ఇప్పటికీ ఆమెని ఓ ఆరాధ్య దేవతలా అభిమానించేవాళ్లున్నారు సౌత్‌లో.

అలాంటిది తన కూతురిని సౌత్‌లో ఎందుకు ల్యాండ్‌ కానివ్వదు. ఒన్స్‌ సౌత్‌లో ఈ బ్యూటీ ల్యాండ్‌ అయ్యి, సక్సెస్‌ కొట్టిందంటే చాలు, అమ్మ శ్రీదేవిపై ఉన్న గౌరవంతో కూతురు జాహ్నవిని కూడా దేవతలా పూజించేస్తారు. అయితే ప్రస్తుతం హిందీలో తొలి సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ త్వరలో సౌత్‌లోనూ కాలు మోపనుందని శ్రీదేవి అభిమానులు ఎదురు చూస్తున్నారు. చూడాలి అందుకు మంచి ముహూర్తం ఎప్పుడు కుదిరెనో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular