HomeMovie News Teluguరష్మి లవర్‌ ఎవరో తెలుసా?

రష్మి లవర్‌ ఎవరో తెలుసా?

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ రష్మి తన లవర్‌ గురించి చెప్పేసింది. ఏం చెప్పిందనుకుంటున్నారా? అయితే కాస్త ఆగాల్సిందే. బుల్లితెర నటుడు సుధీర్‌కీ రష్మీకి మధ్య అఫైర్‌ ఉందంటూ ఎప్పటి నుండో గాసిప్స్‌ వస్తున్నాయి. దాన్ని వారిద్దరూ చాలా సార్లు ఖండించారు కూడా. అయినా కానీ ఈ గాసిప్స్‌ మాత్రం ఆగడం లేదు. తాజాగా రష్మి ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయట పెట్టింది. అంటే తన లవర్‌ గురించి చెప్పేసిందనుకుంటున్నారా? అమ్మో రష్మి చాలా గడుసు. మళ్లీ దాటేసేసింది. అన్నీ చెప్పేసింది కానీ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పలేదు.

ఆ కుర్రాడు ఎవరో నేను చెప్పను. అతనిది ఏ రాష్ట్రమో కూడా చెప్పను. అసలు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలీదు.. అని ఇన్ని చెప్పింది కానీ, ఆ కుర్రోడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. అంటే రష్మి ప్రేమలో ఉన్న సంగతి నిజమే అనుకోవాలి కానీ, ఎందుకో ఆ వ్యక్తి పేరును మాత్రం బయట పెట్టడానికి ఇష్టపడడం లేదు. తాజాగా ‘నెక్స్ట్‌ నువ్వే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గుంటూర్‌ టాకీస్‌’లో హీరోయిన్‌గా నటించి కుర్రోళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది.

బుల్లితెరపై రష్మి ప్రోగ్రాం అంటే ఆరవై ఏళ్ల ముసలాడు కూడా ఆ టైంకి టీవీ ముందు రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. అదీ రష్మి గ్లామర్‌కున్న స్పెషల్‌. తాజాగా వచ్చిన ‘నెక్ట్స్‌ నువ్వే’ సినిమాలో రష్మి సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. సెకండ్‌ హీరోయిన్‌ అయినా కానీ తన క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉందంటోంది. అలాగే స్క్రిప్ట్‌ నచ్చితే ఏ హీరోతోనైనా నటించడానికి రష్మి సిద్ధం అంటోంది. తనకు మాస్‌గా రఫ్‌గా ఉండే కుర్రోళ్లంటే ఇష్టమట. హీరో ప్రబాస్‌ అంటే చాలా ఇష్టమంటోందీ హాట్‌ బ్యూటీ రష్మి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular