HomeMovie News Teluguసిక్స్‌ప్యాక్‌ క్లబ్‌లోకి 'అర్జున్‌రెడ్డి'

సిక్స్‌ప్యాక్‌ క్లబ్‌లోకి ‘అర్జున్‌రెడ్డి’

టాలీవుడ్‌కి సిక్స్‌ ప్యాక్‌ని పరిచయం చేసింది అల్లు అర్జున్‌. ఆ తర్వాత ఈ సిక్స్‌ ప్యాక్‌ బాడీ కోసం చాలా మంది యంగ్‌ హీరోలు తమ శరీరంతో ప్రయోగాలు చేసేశారు. తాజాగా మరో యంగ్‌ హీరో తన శరీరాన్ని ప్రయోగానికి పెడుతున్నానంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన విజయ్‌ దేవరకొండ. ఈ సినిమాతో సెన్సేషనల్‌ విజయం అందుకున్న విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఆ సక్సెస్‌ని కొనసాగించాడు. ‘అర్జున్‌రెడ్డి’తో విజయ్‌ దేవరకొండ సాధించిన సక్సెస్‌ అంతా ఇంతా కాదు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. వివాదాలు కొన్ని సార్లు కలిసొస్తాయి అనడానికి అర్జున్‌రెడ్డి సినిమానే బెస్ట్‌ ఎగ్జామ్‌పుల్‌.

కాగా మన ‘అర్జున్‌రెడ్డి’ హీరో ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేస్తున్నాడట. ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ సమక్షంలో విజయ్‌ దేవరకొండ తన బాడీపై ప్రయోగాలు చేయబోతున్నాననీ చెబుతున్నాడు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు విజయ్‌ దేవరకొండ. తన ట్రైనర్‌తో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్‌ చేశాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ చేతిలో చాలా చిత్రాలే ఉన్నాయి. విజయ్‌ దేవరకొండకి వచ్చిన సక్సెస్‌తో తన గురించి ఏ చిన్న న్యూస్‌ అయినా హాట్‌ న్యూసే అవుతోంది. అలాగే ఈ సిక్స్‌ ప్యాక్‌ న్యూస్‌ కూడా.

ఇదిలా ఉండగా, మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మహానటి’ సినిమాలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్‌ నాగ అశ్విన్‌కీ, విజయ్‌కీ మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. సో ఈ సినిమాలో విజయ్‌కి ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ ఇచ్చాడనీ తెలుస్తోంది. అది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు పాత్ర అనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో ప్రస్తుతానికి తెలీదు కానీ, అర్జున్‌రెడ్డి సిక్స్‌ ప్యాక్‌ మాత్రం ఈ సినిమా కోసం అయితే కాదని చెప్పగలం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular