HomeMovie News Teluguమొన్న రజనీకాంత్‌ ఇప్పుడు శివబాలాజీ

మొన్న రజనీకాంత్‌ ఇప్పుడు శివబాలాజీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రోబో 2.0’ సినిమా ఆడియో ఫంక్షన్‌ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని రీతిలో న భూతో న భవిష్యతి అన్న రేంజ్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది దుబాయ్‌లో. అయితే ఇది సూపర్‌ స్టార్‌ సంగతి. కానీ ఇప్పుడు మళ్లీ ఓ సినిమా ఫంక్షన్‌కి దుబాయ్‌లో వేడుక సిద్ధం చేస్తున్నారు. అది ఓ తెలుగు సినిమా కోసం. అందులోనూ ఓ చిన్న సినిమా. ఈ సినిమాలో శివబాలాజీ, రాజీవ్‌ కనకాల హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ లాంఛింగ్‌ కార్యక్రమం దుబాయ్‌లో చేస్తున్నారు. చిన్న సినిమానే కదా అని చిన్న చూపు వద్దండోయ్‌. ఈ ఫంక్షన్‌ కూడా గ్రాండ్‌గానే చేస్తున్నారట. రేపు సాయంత్రం 5.30కి ఈ సినిమా ట్రైలర్‌ లాంఛ్‌ దుబాయ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా నుండి కాంగ్రెస్‌ నేత హనుమంతరావు, ఆంధ్ర ప్రదేశ్‌ నుండి టీడీపీ నేత కనకళ్ల నారాయణ ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా? ‘స్నేహమేరా జీవితం’.

టైటిల్‌ చూస్తే ఈ సినిమా స్నేహం కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకి శివబాలాజీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. మొన్నీమధ్యనే బుల్లితెర బిగ్‌ షో ‘బిగ్‌బాస్‌’ గేమ్‌ షో విన్నర్‌ అయిన శివబాలాజీ ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాడు. ఇదిగో ఇప్పుడిలా గ్రాండ్‌ ఎంట్రీతో ‘స్నేహమేరా జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular