HomeMovie News Teluguఈ అద్బుతమైన ‘త్రయానికి’ పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ అద్బుతమైన ‘త్రయానికి’ పుట్టినరోజు శుభాకాంక్షలు

కొన్ని రోజులు మనకి ఎప్పటికి ప్రత్యేకంగా ఉండిపోతాయి ఎందుకంటే ఆరోజుకే ఏదొక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఒకరోజే ఈ రోజు (నవంబర్ 7). 

కారణం- ఈ రోజు చలనచిత్ర పరిశ్రమలో ముగ్గురు ప్రముఖులైన లోకనాయకుడు కమల్ హాసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ & అందం-అభినయం కలగలిసిన అనుష్క. ఈ ముగ్గురు తమ తమ స్థానాల్లో తమ ప్రత్యేకతని చాటుకుంటున్నారు.

కమల్ హాసన్ విషయానికి వస్తే, ఒక నటుడు ప్రేక్షకులని మెప్పించడానికి ఏ స్థాయికి అయినా వెళ్ళొచ్చు అని నిరూపించిన ఒక అసామాన్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనకి ప్రేక్షకులు, విమర్శకులతో పాటుగా అవార్డులు సైతం దాసోహం అయ్యాయి.

ఇక మన మాటల మాంత్రికుడు విషయానికి వస్తే, తన మాటలతో ఎంత ప్రేక్షకులని నవ్విస్తాడో అంతే కదిలించగలడు కూడా. ఇక త్రివిక్రమ్ సినిమా వస్తుంది అనగానే సినీ ప్రేక్షకులంతా ఆయన మాటలతో మనకి ఈసారి ఏం చెబుతాడో అని బుద్దిగా స్కూల్ పిల్లల్లా సిద్ధమైపోతారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన పవన్ కళ్యాణ్ చిత్రం గురించి అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ఒక్క అందానికే కాకుండా అభినయానికి కూడా కేర్ అఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఈ అభినవ మాహారాణి దేవసేన అలియాస్ అనుష్క గురించి ఏం చెప్పినా తక్కువే. సినిమాలంటే హీరోల చుట్టూనే తిరుగుతాయి అని అనుకునే వారికి తన రుద్రమదేవి, బాహుబలి, ఇప్పుడొస్తున్న భాగమతి చిత్రాల ద్వారా తెలియచేపుతుంది.

మూడు వేరు వేరు విభాగాల్లో నిష్ణాతులైన ఈ ముగ్గురిని కలిపి ‘త్రీ స్టార్స్’ గా అభివర్ణిస్తూ ఈ మా www.iQlikmovies.com తరపున ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular