HomeMovie News Teluguఅనూసూయ - రేష్మి ఒకరికి ఒకరు

అనూసూయ – రేష్మి ఒకరికి ఒకరు

బుల్లితెర హాట్‌ హాట్‌ ముద్దుగుమ్మలు అనసూయ, రేష్మి. రేష్మి ఎంట్రీతో బుల్లితెరపై అంతవరకూ సోలోగా గ్లామర్‌ ఒలకబోస్తున్న అనసూయ ఔట్‌ అయిపోయిందనే గాసిప్స్‌ కామన్‌గా వినిపిస్తుంటాయి. ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాంలో రేష్మి వచ్చాక అనసూయ తప్పుకుంది. నిజమే. చాలా కాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జబర్దస్త్‌లో కొనసాగుతున్నారు. ‘జబర్దస్త్‌’కి అనసూయ, ‘ఎక్స్‌ట్రా జబర్దస్ట్‌’కి రేష్మి కొనసాగుతున్నారు. కాగా ఈ ఇద్దరికీ ఎప్పుడే గొడవలేనంటూ, వీరిద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనీ గాసిప్స్‌ చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఒట్టి గాసిప్సే.

మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అని ఈ ఇద్దరు ఎంత మొత్తుకున్నా కానీ, ఈ గాసిప్స్‌ మాత్రం ఆగడం లేదు. తాజాగా మా ఇద్దరి మధ్యా ఎలాంటి పొరపొచ్చాలు లేవనీ, చూడండి మేమిద్దరం కలిసి ఎంత ఫ్రెండ్లీగా, హ్యాపీగా ఉన్నామో అంటూ ఓ ఫోటోని అనసూయ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అవును ఈ ఫోటోలో వీళ్లిద్దర్నీ చూస్తే అసలు అనసూయ, రేష్మిలు వీళ్లేనా…అనిపిస్తుంది. అయితే సెలబ్రిటీస్‌పై గాసిప్స్‌ రావడం కామనే. కానీ గాసిప్స్‌ వేరు. వాళ్ల పర్సనల్‌ లైఫ్‌ వేరు. పర్సనల్‌ లైఫ్‌లో వాళ్ల మధ్య ఎలాంటి డిఫరెన్సెస్‌ ఉండవన్నదానికి ఈ ఫోటోనే సాక్ష్యం.

మరో పక్క ఈ ఇద్దరు ముద్దగుమ్మలు వెండితెరపై కూడా దూసుకెళ్తున్నారు. అనసూయ సెలెక్టెడ్‌గా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. అలాగే రేష్మి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే రేష్మి నటించిన ‘నెక్స్ట్‌ నువ్వే’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది హీరోగా నటిస్తున్నాడు. అనసూయ ‘రంగస్థలమ్‌’లో నటిస్తోంది. సుకుమార్‌ – రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular