HomeMovie News Teluguప్రబాస్‌ ది స్పెషల్‌ వన్‌ - శ్రద్ధాకపూర్‌

ప్రబాస్‌ ది స్పెషల్‌ వన్‌ – శ్రద్ధాకపూర్‌

ఈ రోజు బాహుబలి పుట్టినరోజు. ‘బాహుబలి’ సినిమాతో ప్రబాస్‌ యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయాడు. అందుకే తన కోసం బాలీవుడ్‌ నుండి స్టార్‌ హీరోయిన్‌ అయిన బ్యూటీ శ్రద్ధాకపూర్‌ టాలీవుడ్‌కి దిగొచ్చింది. ప్రబాస్‌ అంటే తనకెంతో ఇష్టమనీ, ఇంతవరకూ తాను నటించిన హీరోలందరిలోనూ ప్రబాస్‌ వెరీ వెరీ స్పెషల్‌ అనీ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌. ఈ రోజు ప్రబాస్‌ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రబాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాదు ప్రబాస్‌ ఈజ్‌ వన్‌ అండ్‌ ఓన్లీ అని పొగిడేస్తోంది కూడా. ప్రస్తుతం ప్రబాస్‌ – శ్రద్ధాకపూర్‌ ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. చాలా సరదాగా ఆ షెడ్యూల్‌ సాగిందంటోంది బ్యూటీ శ్రద్ధాపూర్‌. అంతేకాదు ప్రబాస్‌ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ ఈ ముద్దుగుమ్మ గతంలోనే చెప్పింది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు ముంబయ్‌ టు, హైద్రాబాద్‌ షటిల్‌ సర్వీస్‌ చేస్తోందట శ్రద్ధాకపూర్‌.

అందుకే హైద్రాబాద్‌ తనకి రెండో ఇల్లు అయిపోయిందంటోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ క్యారెక్టర్‌కి ఏరికోరి ఈ ముద్దుగుమ్మని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కాగా ఈ రోజు ప్రబాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ‘బాహుబలి’తో మెప్పించిన ప్రబాస్‌ ఈ సినిమాలో స్టైలిష్‌ అండ్‌ రొమాంటిక్‌ లుక్‌లో కెవ్వుకేక పుట్టిస్తున్నాడులే!

You May Like This
- Advertisment -spot_img

Most Popular