HomeMovie News Telugu'అదిరింది' రజనీకి నచ్చింది

‘అదిరింది’ రజనీకి నచ్చింది

తమిళంలో విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మెర్సల్‌’. ‘అదిరింది’ పేరుతో తెలుగులో రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాని తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చూశారట. ఆయనకి ఈ సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా చాలా బాగుంది అని చిత్రయూనిట్‌ని అభినందించారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. అయితే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన విషయాల్ని ప్రస్థావించారు. ఆ విషయాలు బీజేపీకి నచ్చలేదు. దాంతో సినిమాని బ్యాన్‌ చేయాలంటూ ఆందోళనలు రేపిన సంగతి తెలిసిందే.

అలాంటిది బీజేపీకి మద్దతుదారుడైన రజనీకాంత్‌ ఈ సినిమా బాగుందని చెప్పడం. అందులోనూ ఆ ముఖ్యమైన విషయాల ప్రస్థావనను సపోర్ట్‌ చేసినట్లుగా రజనీ స్పందించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఓ సినీ నటుడిగా వేరే హీరో సినిమాలోని కంటెన్ట్‌ నచ్చిందని చెప్పినందుకు ఆయన్ని అభినందించాలి. అందుకే ఆయన సూపర్‌ స్టార్‌ అయ్యారు కూడా. అయితే ఇంతకీ ఆ ముఖ్యమైన విషయాలేంటంటే, ప్రస్తుతం అమలులో ఉన్న ‘జీఎస్టీ’, వైద్య రంగంలో ఉన్న అక్రమాలను ఈ సినిమాలో ఎత్తి చూపారు.

వీటి విషయంలో నిజాలను ప్రస్థావించారు. అదే బీజేపీకి నచ్చలేదు. కానీ సినిమా అయితే అందరికీ నచ్చింది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. విజయ్‌ హీరోగా, సమంత, కాజల్‌, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో.

You May Like This
- Advertisment -spot_img

Most Popular