HomeMovie News Teluguఆ హీరోయిన్‌ ఖాతాలో మరో మెగా ఛాన్స్‌!

ఆ హీరోయిన్‌ ఖాతాలో మరో మెగా ఛాన్స్‌!

‘మజ్ను’ సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌. నాని హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో కూల్‌గా స్వీట్‌గా కనిపించింది. కళ్లతోనే ఏదో మాయ చేసింది. ఆ మాయతోనే వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. కెరీర్‌ స్టార్ట్‌ చేసిన కొద్ది కాలంలోనే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌తో జత కట్టే ఛాన్స్‌ కొట్టేసిందంటే అమ్మడిది మామూలు లక్కు కాదండోయ్‌. నక్క తోకే తొక్కొచ్చింది. తాజాగా అమ్మడి లిస్టులో రెండు మెగా హీరోల సినిమాలు చేతిలో ఉన్నాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో అమ్మడు హీరోయిన్‌గా నటిస్తున్నా సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్‌ సినిమాలంటే హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌కి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే క్యారెక్టర్‌ లెంగ్త్‌తో సంబంధం లేకుండా ఆయా క్యారెక్టర్స్‌ బాగా ఎలివేట్‌ అవుతాయి. ఆ రకంగా పవన్‌ సినిమాలో ఛాన్స్‌ ఒకెత్తు అయితే, అది త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో దక్కించుకోవడం మరో ఎత్తు. కాగా అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేలే హీరోయిన్‌. వక్కంతం వంశీ దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఇవి రెండూ ఇలా ఉండగా, తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందనున్న చిత్రంలో అమ్మడు ఛాన్స్‌ కొట్టేసిందనీ సమాచారమ్‌.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరక్కెబోయే తేజు సినిమాలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఎంచుకున్నారనీ టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఈ టాక్‌ నిజమైతే అమ్మడికి మెగా పండగే పండగ. ఇక ఆ తర్వాత మెల్లగా వరుణ్‌తో కూడా ఓ ఛాన్స్‌ దక్కించేసుకున్నా దక్కించేసుకుంటది. అమ్మడి లక్‌ అలా ఉంది మరి ఏమో ఏం చెప్పగలం. జరిగినా జరగొచ్చు!

You May Like This
- Advertisment -spot_img

Most Popular