HomeMovie News Teluguరజనీపై అమీర్‌ ఖాన్‌ అభిమానం

రజనీపై అమీర్‌ ఖాన్‌ అభిమానం

రజనీకాంత్‌ హీరోగా ‘రోబో 2.0’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా గురించి ఓ హాటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే, ఈ సినిమాలో రోబో పాత్రలో బాలీవుడ్‌ కండల వీరుడు అమీర్‌ ఖాన్‌ని నటించడమని అడిగారట డైరెక్టర్‌ శంకర్‌. ఎందుకంటే ఆ టైంలో రజనీకాంత్‌ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా చేయలేరేమో అనే ఉద్దేశ్యంతో. ఆ తర్వాత రజనీకాంత్‌ కూడా ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌ని నటించమని రిక్వెష్ట్‌ చేశారట. కానీ అమీర్‌ ఖాన్‌కి మనసు ఒప్పలేదట. ఎందుకంటే రోబో పాత్రలో రజనీని తప్ప మరొకర్ని ఊహించుకోలేమంటున్నాడు అమీర్‌ఖాన్‌.

ఇదే విషయాన్ని శంకర్‌కి ఫోన్‌ చేసి ఆయన పాత్రలో నన్ను నేను ఊహించుకోలేను. సో ఈ సినిమా చేయలేననీ చెప్పేశారట అమీర్‌ఖాన్‌. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా ఓ ఇంటర్య్యూలో చెప్పారు. రజనీకాంత్‌ ప్లేస్‌ని భర్తీ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదంటున్నారాయన. ఇదంతా ఆమీర్‌ఖాన్‌కి సూపర్‌స్టార్‌పై ఉన్న అభిమానమే. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా సూపర్‌ స్టార్‌కి అభిమానం ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. ఆ తర్వాత ఆనారోగ్యం నుండి రజనీ కోలుకోవడం, సినిమా షూటింగ్‌లో పాల్గొనడం, సినిమాని పూర్తి చేయడం అన్నీ చక చకా జరిగిపోయాయి.

ప్రస్తుతం ‘రోబో 2.0’ గ్రాఫిక్స్‌ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. మరో పక్క అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయం అందుకుంది. ‘దంగల్‌’ రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ‘థగ్స్‌ ఆప్‌ హిందూస్థాన్‌’లో నటిస్తున్నారు అమీర్‌ఖాన్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular