HomeMovie News Teluguబాలయ్య సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌!

బాలయ్య సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌!

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘గరుడవేగ’. ఈ చిత్రం ట్రైలర్‌ బాలయ్య చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ చాలా బాగుంది. టెక్నికల్‌గా సూపర్బ్‌ అనిపిస్తోంది. డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ట్రైలర్‌ని బాగా కట్‌ చేశాడు. మంచి విషయం ఉన్నోడు ప్రవీణ్‌ సత్తారు. ఈ సినిమాతో రాజశేఖర్‌ హిట్‌ కొట్టేలానే ఉన్నాడు. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ చాలా బాగున్నాయి. రాజశేఖర్‌ సినిమాల నుండి ప్రేక్షకులు ఆశించేదిదే. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ‘గరుడవేగ’ సినిమాలో ఉన్నట్లే కనిపిస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ బాలయ్య చేతుల మీదుగా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందంటూ రాజశేఖర్‌ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను బయట పెట్టడం జరిగింది. బాలయ్య సినిమాలో విలన్‌గా నటించాలని ఉందని రాజశేఖర్‌ అన్నారు. గతంలో చిరంజీవి సినిమాలో కూడా విలన్‌గా నటించాలనుందని రాజశేఖర్‌ అన్నారు. అయితే ఆది కుదరలేదు. ఈ సారి బాలయ్య అయినా ఆ అవకాశం ఇస్తారేమో చూడాలి. హ్యాండ్‌సమ్‌ హీరో జగపతిబాబుకి విలన్‌గా ఛాన్సిచ్చింది బాలయ్యే. బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘లెజెండ్‌’ సినిమాతో జగ్గూ భాయ్‌ విలన్‌గా కొత్త అవతారమెత్తి, సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. దాంతో అక్కడి నుండి ఆయన దశే మారిపోయింది.

బిజీయెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయిపోయారు. అలాగే బాలయ్య చేయి వేస్తే రాజశేఖర్‌ లక్‌ కూడా తిరగబడనుందేమో చూడాలి. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గరుడవేగ’లో పూజా కుమార్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌లో నర్తిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular