HomeMovie News Teluguమోహన్ బాబు నుండి డా. మోహన్ బాబు

మోహన్ బాబు నుండి డా. మోహన్ బాబు

కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబుకి తమిళనాడులోని MGR విశ్వవిద్యాలయం నిన్న డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

నటుడిగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలకుగాను MGR విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ గారి చేతుల మీదుగా మోహన్ బాబుకి అందచేయడం జరిగింది. డాక్టరేట్ అందుకున్న సందర్భంలో మోహన్ బాబు మాట్లాడుతూ- తను ఈ సమాజానికి చేస్తున్న సేవలకి గుర్తింపు గా ఈ డాక్టరేట్ లభించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు.

ఇక ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు మనోజ్ విచ్చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2007లో ‘పద్మశ్రీ’ ప్రకటించి సత్కరించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular