HomeMovie News Teluguఅదరగొట్టేశావ్ మహేష్

అదరగొట్టేశావ్ మహేష్

మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్పైడర్‌’. టీజర్‌తో అదరగొట్టేసిన ‘స్పైడర్‌’ ఇప్పుడు మరో లుక్‌తో సూపర్బ్‌ అనిపిస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘స్పైడర్‌’ ఫస్ట్‌లుక్‌లో టైటిల్‌ని తెలుగు లెటర్స్‌తో డిజైన్‌ చేశారు. ఇక సూపర్‌ స్టార్‌ లుక్‌ చూస్తే ఆయన అభిమానులు ఇంతవరకూ చూసిన ఎదురు చూపులకి సరైన కానుక లభించినట్లే. అంత హ్యాండసమ్‌గా ఉన్నాడు ఈ లుక్‌లో సూపర్‌ స్టార్‌. సూపర్‌స్టార్‌ అంటే సూపర్‌స్టార్‌లాగానే ఉన్నాడు. మొదట్నుంచీ ‘స్పైడర్‌’పై భారీ అంచనాలున్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా నుండి ఏ లుక్‌ వచ్చినా, అంత ఇన్నోవేటివ్‌గానూ, అంచనాలకు మించిపోయేలానే ఉంటోంది. టీజర్‌తోనే సంచలనాలు సృష్టించాడు మహేష్‌బాబు. ఇప్పుడొచ్చిన ఈ తాజా స్టిల్‌తో అదరగొట్టేస్గున్నాడు. టైటిల్‌లో ‘డ’ లెటర్‌ తలకట్టుని రివర్స్‌లో పెట్టడంతో, డైరెక్టర్‌ క్రియేటివిటీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఈ సినిమాలో అర్ధం చేసుకోవచ్చు. అందులోనూ అక్కడ ఉన్నది అసలే మురుగదాస్‌. మురుగదాస్‌ సినిమాలు చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో మహేష్‌ స్కై కాప్‌గా నటిస్తున్నాడు. అంటే ఈ సినిమా ఇంకెంత ఇన్నోవేటివ్‌గా ఉండబోతోందో.

స్టిల్స్‌తోనే ఈ రేంజ్‌లో ఎట్రాక్ట్‌ చేస్తుంటే, సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపవుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాతోనే తొలిసారిగా మహేష్‌ తమిళంలో అడుగుపెట్టబోతున్నాడు. ఎస్‌.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి అభిమానులు ఆశించినట్లే ‘స్పైడర్‌’ నుండి వచ్చే స్టిల్స్‌ ఓ రేంజ్‌లో అదరగొట్టేస్తున్నాయి. దసరా కానునగా ‘స్పైడర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular