HomeMovie News Teluguపూరి నువ్వు దేవుడివి

పూరి నువ్వు దేవుడివి

తమ అభిమాన హీరో స్క్రీన్‌ మీద డిఫరెంట్‌ లుక్‌తో అత్యద్భుతమైన పవర్‌తో కన్పిస్తోంటే, ఆ లుక్‌ని డిజైన్‌ చేసి, అంత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేసిన డైరెక్టర్‌ని అభిమానులు దేవుడనే అంటారు. ఆ కోణంలో చూస్తే పూరి జగన్నాథ్‌, ఇప్పుడు బాలయ్య అభిమానులకి దేవుడిలానే కనిపిస్తున్నాడు. ‘పైసావసూల్‌’ సినిమాలో బాలకృష్ణని చాలా డిఫరెంట్‌గా చూపించబోతున్నాడు పూరి జగన్నాథ్‌.

ఎంత డిఫరెంట్‌గా అంటే, ఒక్కో స్టిల్‌ విడుదలవుతోంటే అభిమానుల అంచనాలు రెట్టింపు, పదింతలు కాదు ఇంకా ఇంకా ఎక్కువే పెరిగిపోతున్నాయి. రేపు ఉదయం 10 గంటల 32 నిమిషాలకు ‘పైసావసూల్‌’ టీజర్‌ విడుదల కాబోతోంది. టీజర్‌ కాదిది, దీని పేరు స్టంపర్‌. పూరి జగన్నాథ్‌ కొత్తగా కనిపెట్టాడు ఈ స్టంపర్‌ని. స్టంపర్‌ అంటే ఏంటో తెలుసా? అని చెబుతూ ప్రీ టీజర్‌ని పూరి విడుదల చేయడం, అది కూడా అభిమానుల్ని అమితంగా ఆకట్టుకోవడం తెలిసిన సంగతే.

స్టంపర్‌ ఎలా ఉంటుందోగానీ, రేపే స్టంపర్‌ విడుదల అని లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో సినిమా యూనిట్‌ పోస్ట్‌ చేసిన స్టిల్‌, ఆ డిజైన్‌ అల్టిమేట్‌గా ఉందంతే. ఈ స్టిల్‌ చూశాక ఎవరైనా పూరిని దేవుడితో పోల్చేస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పూరి ఈ చిత్రాన్ని తీసుకున్నాడు. పూరి కనెక్ట్స్‌ ద్వారా చాలామంది కొత్త నటీనటుల్ని ఈ సినిమాకి పరిచయం చేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular