HomeMovie News Teluguరకుల్‌ బ్యాలెన్స్‌ చేయగలదా?

రకుల్‌ బ్యాలెన్స్‌ చేయగలదా?

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ. అమ్మడి పర్‌ఫామెన్స్‌కి మెచ్చి తమిళం నుండీ పలు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు తమిళ సినిమాలకు రకుల్‌ సైన్‌ చేసింది. అలాగే బాలీవుడ్‌ నుండి అవకాశాలు వస్తున్నాయి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి. దాంతో ఓ హిందీ సినిమాకీ ఓకే చెప్పింది మన స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

అయితే తెలుగులో అస్సలు ఖాళీ లేని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మూడు భాషల నుండీ వరుస కడుతున్న అవకాశాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అసలు రకుల్‌ ఈ మూడింటినీ బ్యాలెన్స్‌ చేయగలదా? ఇంతవరకూ చాలా మంది హీరోయిన్లు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. కానీ రకుల్‌ పరిస్థితి అలా కాదు. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ రకుల్‌. సో టాలీవుడ్‌కే తన మెయిన్‌ ప్రిఫరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితేనేం రకుల్‌ని తక్కువగా అంచనా వేయలేము. రకుల్‌ ప్లానింగ్‌లో చాలా పక్కాగా ఉంటుంది. పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌ రకుల్‌ది.

ఆమెకి ఏదైనా సాధ్యమే. అయితే మూడు భాషల్నీ ఒకేసారి మేనేజ్‌ చేయాలంటే ఏ హీరోయిన్‌కైనా కష్టమేలెండి. మరి రకుల్‌ ఏం చేస్తుందో చూడాలిక. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌బాబుతో ‘స్పైడర్‌’ సినిమాలోనూ, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకీ నాయకా’ సినిమాలోనూ నటిస్తోంది. లేటెస్టుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోనూ రకుల్‌ నటించనుందనీ సమాచారమ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular