HomeMovie News Teluguహీరోయిన్‌పై అఘాయిత్యానికి కోటిన్నర?

హీరోయిన్‌పై అఘాయిత్యానికి కోటిన్నర?

మలయాళ సినీ నటి భావన కిడ్నాప్‌, అత్యాచార కేసు ఓ కొలిక్కి వచ్చింది. సినీ పరిశ్రమలో వికృత పోకడకు నిదర్శనమిది. మలయాళ నటుడు దిలీప్‌కుమార్‌, హీరోయిన్‌ భావనపై అఘాయిత్యం కోసం కోటిన్నర రూపాయలు ‘సుపారీ’గా ఇచ్చాడట. అఘాయిత్యమే చెయ్యమన్నాడో, అఘాయిత్యం జరిగినట్లుగా ఆమె జీవితాన్ని, సినిమా కెరీర్‌ని నాశనం చెయ్యమన్నాడోగానీ కుట్రకు కేంద్ర బిందువు దిలీప్‌ కుమారేనని పోలీసులు తేల్చారు. అతన్ని అరెస్ట్‌ చేశారు కూడా.

కొన్నాళ్ళ క్రితం హీరోయిన్‌ భావన, షూటింగ్‌ ముుగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా కేరళలో ఆమెను కిడ్నాప్‌ చేశారు. కారులోనే కిడ్నాప్‌ చేసి, ఆమెపై అత్యచారం చేసినట్లుగా, అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసిన ఇష్యూ అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌ నుండి పలువురు సినీ నటీనటులు ఆమెకు బాసటగా నిలిచారు. ఈ ఘటనలో భావన దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి, మరికొందరు నిందితులుగా తేలారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి, విచారణ జరుపుతుండగా విచారణలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

సినీ పరిశ్రమలో ఇలాంటి వికృత పోకడను తామెప్పుడూ చూడలేదని సినీ ప్రముఖులు అంటుండడం విశేషం. ముద్దుగుమ్మ భావన తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘ఒంటరి’, మహాత్మ, హీరో తదితర చిత్రాలు భావనకు నటిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాలు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular