HomeMovie News Teluguస్టైల్‌ ఐకాన్‌ యంగ్‌ టైగర్‌

స్టైల్‌ ఐకాన్‌ యంగ్‌ టైగర్‌

పక్కా మాస్‌ హీరో అనే ఇమేజ్‌ నుంచి బయటపడిన యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ డిఫరెంట్‌ కథాంశాల్ని ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నాడు. ‘టెంపర్‌’ సినిమా నుంచి ఈ యంగ్‌ టైగర్‌ కొత్త పంథాలో అడుగు పెడుతూ, ఆశ్చర్యపరుస్తున్నాడు అందర్నీ. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం ఎన్టీయార్‌ సంపాదించుకున్న లుక్‌ బీభత్సం. స్టార్టింగ్‌ నుండీ అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకున్నాడు ఆ లుక్‌తో. వెరీ వెరీ ట్రెండింగ్‌ అయిపోయింది ఆ తర్వాత ఆ లుక్‌. కుర్రకారు బాగా ఫాలో అయ్యారు ఎన్టీఆర్‌ లుక్‌ని ఆ సినిమా తర్వాత.

ఇంతవరకూ సినిమా ఈవెంట్స్‌లోనూ, ఇతరత్రా సందర్భాల్లోనూ సింపుల్‌గా కన్పించే ఎన్టీయార్‌ ఈ మధ్యకాలంలో డిఫరెంట్‌ లుక్‌లో, స్టైలిష్‌ అప్రోచ్‌తో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంటున్నాడు. స్టైల్‌ ఐకాన్‌ అనే ఇమేజ్‌ ఈమధ్యకాలంలో ఎన్టీయార్‌ని చాలా గట్టిగా వాటేసుకుంటోందని చెప్పక తప్పదు. ‘జై లవ కుశ’ సినిమా కోసం ఎన్టీయార్‌ మూడు పాత్రల్లో కనిపిస్తాడు. అందులోంచి ఓ పాత్ర రివీల్‌ అయ్యింది. అది నెగెటివ్‌ రోల్‌. నెగిటివ్‌ రోల్‌లోనూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్‌.

ఇంకో రెండు పాత్రలు ఇంకా బాగా సర్‌ప్రైజ్‌ చేయనున్నాయట. ఇది కాకుండా బుల్లితెరపై ‘బిగ్‌ బాస్‌ షో’ ద్వారా ఎన్టీయార్‌ ఇవ్వబోయే సర్‌ప్రైజ్‌కి షాక్‌ అవ్వాల్సిందేనంటున్నారు. ఈ షోకి ఎన్టీఆర్‌ చేస్తున్న పబ్లిసిటీ చూస్తుంటే మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించక మానదు. ఈ షోతో ఎన్టీఆర్‌ ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటో కానీ, ఆ సర్‌ప్రైజ్‌కి మీరు రెడీనా? బీ రెడీ!

You May Like This
- Advertisment -spot_img

Most Popular