HomeMovie News Teluguనితిన్‌ 'లై' కి చాలా సీనుందట

నితిన్‌ ‘లై’ కి చాలా సీనుందట

నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లై’. హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నానితో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ వంటి క్యూట్‌ లవ్‌ స్టోరీకి, యాక్షన్‌ మేళవించి, అద్భుతంగా తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ సినిమాలో నితిన్‌ని ఓ పాత బస్తీ కుర్రాడిగా చూపించనున్నాడు. నితిన్‌ లుక్‌ ఆల్రెడీ బయటికి వచ్చింది. ఆ లుక్‌లో నితిన్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అలాగే ఇప్పుడు డిస్కర్షన్‌ ఏంటంటే ఈ సినిమాలో సీనియర్‌ హీరో అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే అర్జున్‌ పాత్ర సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అర్జున్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాక ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ లుక్‌లో ఆర్జున్‌ బ్యాక్‌ సైడ్‌ నుండి వీపు కనిపించేలా ఉన్నాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో రిలాక్స్‌ అవుతున్న స్టిల్‌ అది. అర్జున్‌ వీపుపై ఉన్న టాటూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ లుక్‌తో అర్జున్‌ క్యారెక్టర్‌ విలనో కాదో తెలీదు కానీ కీలక పాత్రలో ఆర్జున్‌ నటించబోతున్నాడని తెలియ వస్తోంది. అంతే కాదు చాలా పవర్‌ ఫుల్‌, అండ్‌ ఇంటెలిజెన్స్‌ క్యారెక్టర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది కూడా.

గతంలో అర్జున్‌, నితిన్‌ కాంబినేషన్‌లో ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో అర్జున్‌ మారుతిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ రిపీట్‌ అయిన ఈ సినిమాలో వీరి కాంబినేషన్‌ ఏంటనేది ప్రస్తుతం ఇంకా సస్పెన్సే. ముద్దుగుమ్మ మేఘా ఆకాష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular