HomeMovie News Teluguఆ బ్యూటీ కొల్లగొట్టేస్తోంది

ఆ బ్యూటీ కొల్లగొట్టేస్తోంది

‘ప్రేమమ్‌’ సినిమాతో తానేంటో నిరూపించేసుకుంది ముద్దుగుమ్మ సాయి పల్లవి. కోలీవుడ్‌లోనే కాకుండా, టాలీవుడ్‌లో కూడా ఆ సినిమాతో అమ్మడి పేరు మార్మోగిపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి మెగా కాంపౌండ్‌లో చోటు దక్కేసింది. తెలుగులో తొలి సినిమాకే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పక్కన ఛాన్స్‌ కొట్టేసింది సాయి పల్లవి. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ‘ఫిదా’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.

ట్రైలర్‌ వచ్చాక సాయి పల్లవి టాలెంట్‌ డైరెక్ట్‌గా తెలిసిపోయింది తెలుగు ప్రేక్షకులకి. ట్రైలర్‌లో ముద్దుగుమ్మ పర్‌ఫామెన్స్‌కి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. ‘హ్యాపీ డేస్‌’ సినిమాతో మిల్కీ బ్యూటీ తమన్నాకి తెలుగు ప్రేక్షకులు అత్యంత దగ్గరయ్యారు. ఆ సినిమా తర్వాతే తమన్నాకి స్టార్‌డమ్‌ వైపు అడుగులు వేసే అవకాశం కలిగింది. అలాగే తాజాగా ముద్దుగుమ్మ సాయి పల్లవికి కూడా ‘ఫిదా’ సినిమా తెలుగులో మంచి ప్లాట్‌ఫాం కానుందని టాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రైలర్‌లో సాయి పల్లవి చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. డాన్సుల్లో ఈజ్‌, యాక్టింగ్‌లో టాలెంట్‌ అన్నీ వెరసి, సాయి పల్లవి ట్రైలర్‌తోనే మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. మరో పక్క వరుణ్‌ తేజ్‌ ఇటీవలే ‘మిస్టర్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలంగాణా అమ్మాయి, అమెరికా అబ్బాయి మధ్య లవ్‌ స్టోరీ అనే కాన్సెప్ట్‌తో క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ‘ఫిదా’ తెరకెక్కుతోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular