HomeMovie News Teluguరకుల్‌ మెచ్చే వరుడెలా ఉండాలంటే..

రకుల్‌ మెచ్చే వరుడెలా ఉండాలంటే..

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌తో ఆకట్టుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని పెళ్లి ఎప్పుడు? అని అడిగితే.. అప్పుడే పెళ్లి చేసి పంపించేస్తారా? ఇంకా హీరోయిన్‌గా బోలెడన్ని సినిమాలు చేయద్దా..? అంటూ కొంటెగా తిరుగు ప్రశ్నలు వేసి మాట దాటేసినా, కానీ తనకి కాబోయే వరుడెలా ఉండాలో మాత్రం చెప్పేసింది. రకుల్‌ ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది. అలాగే తనని ఎప్పటికీ, నవ్విస్తూ ఉండాలట తనకు కాబోయే భర్త. అలాగే చాలా చాలా ప్రేమించేవాడై ఉండాలంటోంది.

అరటే రకుల్‌ లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటానని చిన్న హింట్‌ ఇచ్చినట్లుంది. మరో మాట.. ఆరడుగుల ఆందగాడై ఉండాలట. ఆరడుగులు ఎందుకంటే రకుల్‌కి హై హీల్స్‌ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టమట. పొట్టిగా ఉంటే హై హీల్‌ వేసుకోవడం కుదరదు కదా.. అందుకని ఆరడుగులున్న వాడినే తనకు కాబోయే భర్తగా ఎంచుకుంటానంటోంది. రకుల్‌కి కేవలం నటనే కాదండోయ్‌. చాలా విషయాలపై అవగాహన ఉంది.

సామాజిక విషయాలపై ఆశక్తి ఎక్కువే. అందం, ఫిజిక్‌ విషయంలో రకుల్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన లైఫ్‌లో జిమ్‌ అనేది ఓ నిత్యకృత్యం అంటోంది. ఏ రోజూ జిమ్‌కెళ్లకుండా ఉండలేనంటోంది ముద్దుగుమ్మ రకుల్‌. త్వరలోనే ‘స్పైడర్‌’ సినిమాతో మన ముందుకు రానుంది. ఆరడుగుల అందగాడు మహేష్‌తో తొలిసారిగా జత కడుతోంది రకుల్‌ ఈ సినిమాలో.

You May Like This
- Advertisment -spot_img

Most Popular