HomeMovie News Teluguబాలయ్య అస్సలేమాత్రం తగ్గట్లేదు

బాలయ్య అస్సలేమాత్రం తగ్గట్లేదు

వయసు మీద పడుతున్నా నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్టింగ్‌లోని ఈజ్‌ చూపించడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. యంగ్‌ స్టార్‌ అయిపోతున్నాడు. డాన్సుల్లో యంగ్‌ స్టార్స్‌తో పోటీ పడుతున్నాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా ఎంతకూ తగ్గడం లేదు. డూప్స్‌ లేకుండానే రిస్కీ షాట్స్‌కి ప్రిఫరెన్స్‌ ఇస్తున్నాడు. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం బాలయ్య తన బాడీ లాంగ్వేజ్‌లో మరిన్ని ఛేంజెస్‌ చేసుకున్నాడట. ఇంతకు ముందెన్నడూ బాలయ్యలో కనిపించని కొత్త యాంగిల్‌ని ఈ సినిమాలో పూరీ చూపించబోతున్నాడట.

ఈ సినిమా బాలయ్యకి 101వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు పూరీ ఈ సినిమాని. ఈ సినిమాని సెప్టెంబరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నాడు పూరీ. సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు పూరీ. నందమూరి హీరోల్లో ఎన్టీఆర్‌తో ‘టెంపర్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టాడు పూరీ. కళ్యాణ్‌ రామ్‌తో ‘ఇజం’ సినిమాని తెరకెక్కించినా, అది ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘రోగ్‌’ ఫర్వాలేదనిపించింది. కానీ బాలయ్యతో పూరీ తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాలని కసితో ఉన్నాడట పూరీ. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ సినిమా. ముద్దుగుమ్మ శ్రియ ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో ఇద్దరు కొత్త భామలు బాలయ్యతో జత కట్టనునున్నారు. ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్‌ మెచ్చుకోదగ్గ చిత్రమవుతుందంటున్నారు ఈ సినిమా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular