HomeMovie News Teluguఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ నిజమేనా?

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ నిజమేనా?

2019 ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ అందరి దృష్టి ఎన్నికల పైనే. పొలిటీషియన్స్‌ దృష్టి కాదండోయ్‌. సినిమా వాళ్ల సంగతి. సినిమాలు, పొలిటీషియన్స్‌.. అసలేంటి ఈ కథ అనుకుంటున్నారా? అదేనండీ, మన హీరోలు చేయబోయే తదుపరి సినిమాల కాన్సెప్ట్స్‌కి పోలిటిక్స్‌తో లింకులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే కొరటాల శివ – మహేష్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ‘భరత్‌ అను నేను’ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్‌ కళ్యాణ్‌ చేయబోతున్న సినిమాకి పొలిటికల్‌ టచ్‌ ఉందంటున్నారు.

ఇప్పుడు కొత్తగా ఆ కోవలోకి ఎన్టీఆర్‌ కూడా వచ్చి చేరాడు. పవన్‌తో సినిమా అయినాక ఎన్టీఆర్‌ తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా చేస్తున్నారనీ గాసిప్స్‌ వస్తున్నాయి. కేవలం గాసిప్స్‌ మాత్రమే కాదు. ఏకంగా కథా కమామిషు కూడా ప్రచారం అయిపోతోంది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఎన్టీఆర్‌ కోసం త్రివిక్రమ్‌ ఓ పవర్‌ ఫుల్‌ పొలిటికల్‌ స్టోరీని సిద్ధం చేస్తున్నారంటూ సమాచారమ్‌. ఆ సినిమాను 2019 ఎలక్షన్స్‌ టైమ్‌ దగ్గర చేసి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారంటూ ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ బాగా వినిపిస్తోంది.

ఈ విషయంపై ఇటు ఎన్టీఆర్‌ కానీ, అటు త్రివిక్రమ్‌ కానీ ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. అలాగే త్రివిక్రమ్‌ కూడా ఖాళీగా లేడు. పవన్‌ కళ్యాణ్‌తో కూల్‌ అండ్‌ లవ్‌లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నాడు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular