HomeMovie News Teluguరామ్‌ చరణ్‌కి అఖిల్‌ తమ్ముడంట

రామ్‌ చరణ్‌కి అఖిల్‌ తమ్ముడంట

మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులు. బిజినెస్‌ పాట్నర్స్‌ కూడా. అలాగే చిరు తనయుడు రామ్‌ చరణ్‌ అందరితోనూ అత్యంత సన్నిహితంగా ఉంటాడు. చరణ్‌కి రానా మంచి స్నేహితుడు. అప్పుడప్పుడూ మహేష్‌ని కూడా కలుస్తుంటాడు చరణ్‌. చాలా ఆప్యాయంగా మెలగుతూ ఉంటాడు. ఎన్టీఆర్‌తో కూడా మంచి స్నేహం ఉంది రామ్‌ చరణ్‌కి. అందరిలోనూ అఖిల్‌ అంటే రామ్‌ చరణ్‌కి చాలా ఇష్టమట. అలాగే అఖిల్‌కి కూడా చరణ్‌ అంటే అభిమానం. చరణ్‌ పక్కన ఉంటే ఏదో తెలీని ఫీలింగ్‌.. తన సొంత మనిషి అనే భావం కలుగుతుంది అంటున్నాడు అఖిల్‌.

చరణ్‌ హగ్గింగ్‌లో కేరింగ్‌ ఉంటుంది. సొంత అన్నయ్య అనే భావం కల్గిస్తాడు అని అఖిల్‌ చెబుతున్నాడు. పరిచయమయ్యినప్పట్నుంచీ వీరిద్దరి మధ్యా ఏదో తెలీని ఇంట్రాక్షన్‌ ఏర్పడిందట. ఈ మాటలు స్వయంగా అఖిల్‌, మెగాస్టార్‌ చిరుతో అన్నాడు. తాజాగా అఖిల్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌ షోకి గెస్ట్‌గా వచ్చాడు. ఆ సందర్భంగానే ఈ మాటలు అన్నాడు. అవును నిజమే మెగా ఫ్యామిలీ ఎవరితోనైనా అంతే ఆప్యాయంగా మెలగుతూ ఉంటారు. చరణ్‌కి తమ్ముళ్లు లేరు కాబట్టి, అఖిల్‌ని ఓ తమ్ముడిలా భావిస్తాడట.

అందుకే చరణ్‌ అంటే తనకెంతో అభిమానం అంతకన్నా మించి ఇష్టం అంటున్నాడు అఖిల్‌. తన అన్నయ్య నాగ చైతన్య ఉన్నప్పటికీ, చరణ్‌ తనకి మరో అన్నయ్య అంటున్నాడు అక్కినేని బుల్లోడు అఖిల్‌. అఖిల్‌ రెండో సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ‘మనం’ డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 25 రోజుల షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకుందట ఈ సినిమా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular