HomeMovie News Teluguరాముడిగా చరణ్‌: కొత్త స్టిల్‌ సూపర్బ్‌

రాముడిగా చరణ్‌: కొత్త స్టిల్‌ సూపర్బ్‌

‘రామాయణం’ సినిమాకి దృశ్య రూపం ఇవ్వబోతున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది. యూనివర్సల్‌ స్థాయిలో ఈ చిత్రం రూపొందించబోతున్నారంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో పాత్రధారులు ఎవరు.. అనే విషయం లోకి వస్తే, రామాయణం సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారో తెలియదు. కానీ నిర్మించేది మాత్రం గీతా ఆర్ట్స్‌ అని క్లారిటీ వచ్చింది. ఇంకో ఇద్దరు నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

అయితే ఇందులో రామ్‌చరణ్‌ నటించబోతున్నాడంటూ గాసిప్స్‌ వినవస్తున్నాయి. రాముడి పాత్రలో రామ్‌ చరణ్‌ నటించాలనే తమ కోరికను అభిమానులు ఎక్స్‌పోజ్‌ చేస్తున్నారు. ఆ కోణంలోనే అభిమానులు కొన్ని స్టిల్స్‌ని రూపొందిస్తున్నారు. మొన్నటికి మొన్న రాముడి గెటప్‌లో డిఫరెంట్‌గా ఉన్న ఓ స్టిల్‌ని వదిలారు. అలాంటి స్టిల్స్‌ చాలానే రూపొందిస్తున్నారు. తాజాగా వాటిల్లో ఓ డిజైన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇంకా ఫ్రెష్‌గా ఇంకో స్టిల్‌ ఇప్పుడు బయటికి వచ్చింది.

ఈ తాజా స్టిల్‌ ఇంకా హాట్‌ హాట్‌గా ప్రచారం అవుతోంది. అవతార్‌ తరహాలో ఈ గెటప్‌ని రూపొందించారు. డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌కి పాత్రల ఎంపిక విషయంలో పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా, సోషల్‌ మీడియా వేదికగా అభిమానులే తమ హీరోలు ఎలా ఉండాలో ఓ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular