HomeMovie News Telugu'దంగల్‌' బాహుబలిని దాటేస్తోందా?

‘దంగల్‌’ బాహుబలిని దాటేస్తోందా?

అమీర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దంగల్‌’. ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాదు, తెలుగులోనూ విడుదలై మంచి సక్సెస్‌ అందుకుంది. ఈ తరహా చిత్రాలు అన్ని భాషల్లోనూ రావాలని ఈ సినిమాని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. రెజ్లింగ్‌ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచనలనాలు సృష్టిస్తోంది. నిన్నటికి ఈ సినిమా సాధించిన వసూళ్లు 1100 కోట్లు.

మరో పక్క తెలుగు సినిమా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఆల్రెడీ 1250 కోట్లు దాటేసింది. ‘దంగల్‌’ సినిమా ‘బాహుబలి’కి గట్టి పోటీగా నిలిచింది. మరి కొద్ది రోజుల్లోనే ‘బాహుబలి’ని టచ్‌ చేసేలా ఉంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని అంటున్నాయి ఫిలిం వర్గాలు. కానీ చైనాలో ‘దంగల్‌’ సినిమా విడుదలయ్యాక అంచనాలు మారిపోయాయి. వసూళ్లు భారీగా పెరిగాయి. మరో పక్క ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. చూడని వాళ్లు ఇంకా చూస్తున్నారు. చూసినవాళ్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

వేసవి సెలవులు ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. అలాగే మరో పెద్ద సినిమా కూడా ఏదీ లేకపోవడం ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఈ మేనియా ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని రికార్డులు సాధించిన ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలిక! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular