HomeMovie News Teluguపవన్‌కి 'బాహుబలి' లాంటి ఛాన్స్‌!

పవన్‌కి ‘బాహుబలి’ లాంటి ఛాన్స్‌!

బాహుబలి రచయిత, పవన్‌తో సినిమా చేస్తానంటున్నాడు. ఆయనే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. గతంలో రాజమౌళి, పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. ఆ తరుణం ఇప్పుడు రానుంది కాబోలు. విజయేంద్రప్రసాద్‌ పవన్‌ కోసం ఓ చక్కటి కథని ప్రిపేర్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారట. ‘బాహుబలి’ కథని ప్రిపేర్‌ చేస్తున్నప్పుడే ఆయన మదిలో పవన్‌ మెదిలారు. అందుకే బాహుబలి కథకి పవన్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన రాసుకున్న సీన్స్‌ ఎన్నో ఉన్నాయి.

వాటిలో కథని మలుపు తిప్పిన ఇంటర్వెల్‌ సీన్‌ ఒకటి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఈ చిత్రం. అలాగే విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ‘భజరంగీ భాయీజాన్‌’ సినిమా కూడా అంతే గుర్తింపు పొందింది. అందుకే ఆయనతో కలిసి పవన్‌ ఓ సినిమా చేస్తే బావుంటుందని పవన్‌ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోలే విజయేంద్రప్రసాద్‌ కథల కోసం క్యూలు కడుతున్నారు. అలాంటిది టాలీవుడ్‌ సంచలనం పవన్‌ కళ్యాణ్‌ కోసం విజయేంద్రప్రసాద్‌ ఎలాంటి కథ రాస్తారో, ఆ కథలో ఎంత పవర్‌ ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది.

ఆ సినిమా ఖచ్చితంగా మరో సెన్సేషనల్‌ మూవీనే అవుతుంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా తర్వాత పవన్‌, విజయేంద్రప్రసాద్‌ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతుందేమో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular