HomeMovie News Teluguహాలీవుడ్‌ స్టార్‌గా మారిన లవర్‌ బోయ్‌

హాలీవుడ్‌ స్టార్‌గా మారిన లవర్‌ బోయ్‌

‘ప్రేమలేఖ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో అజిత్‌. లవర్‌ బోయ్‌ ఇమేజ్‌తో అమ్మాయిల హృదయాల్ని కొల్లగొట్టేశాడు. అజిత్‌ సినిమాలకి అమ్మాయిల్లో సూపర్‌ క్రేజ్‌ ఉండేది అప్పట్లో. కానీ తర్వాత మెల్ల మెల్లగా మాస్‌ హీరోగా మారిపోయాడు. ఒరిజినల్‌ లుక్‌తోనే సూపర్‌ హిట్స్‌ కొట్టేస్తున్నాడు. తాజాగా అజిత్‌ ‘వివేగం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించేలా ఉంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ టీజర్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తోంది.

సిక్స్‌ ప్యాక్‌తో ఉన్న అజిత్‌ మరో సారి నేచురల్‌ లుక్‌లోనే అమ్మాయిలకు క్రేజీ హీరోగా మారిపోయాడు. తెలుగులో అజిత్‌కి మార్కెట్‌ బాగానే ఉంది. ఆ మార్కెట్‌ ఈ మధ్య మరీ రెట్టింపయ్యింది. అజిత్‌ నటించిన ‘వీరమ్‌’, వేదాలమ్‌’ సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. అలాగే ఇప్పుడు ‘వివేగం’ సినిమాని కూడా తెలుగులో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగా అంచనాలున్నాయి.

ఈ సినిమాలో అజిత్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, అక్షర హాసన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ సెన్సేషనల్‌ అండ్‌ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. ఆగష్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular