HomeMovie News Telugu'సాహోరే' అన్న పవన్‌, మహేష్‌

‘సాహోరే’ అన్న పవన్‌, మహేష్‌

దర్శక ధీరుడు రాజమౌళి తెగువని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి ది కంక్లూజన్‌’ విజయంపై ఓ సారి స్పందించిన మహేష్‌ ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ళు దాటిన నేపథ్యంలో తాజాగా ఇంకోసారి రాజమౌళిపై ప్రశంసలు గుప్పించాడు. వెయ్యి కోట్ల వసూళ్ళను సాధించిన చిత్రాన్ని తెరకెక్కించినందుకుగాను తాను, తనతోపాటు తెలుగు సినీ పరిశ్రమ అంతా గర్విస్తోందని మహేష్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. ఇంకో వైపున పవన్‌కళ్యాణ్‌ కూడా రాజమౌళిని, హీరో ప్రభాస్‌నీ అభినందనలతో ముంచెత్తాడు.

మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపాడు పవన్‌కళ్యాణ్‌. ఈ విజయాల పరంపర ఇంకా ఇంకా కొనసాగించాలని రాజమౌళిని కోరాడు పవన్‌కళ్యాణ్‌ సోషల్‌ మీడియా ద్వారా. ‘బాహుబలి ది కంక్లూజన్‌’ సినిమాతో సినీ పరిశ్రమలో విభేదాలు లేవని ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. అభిమానుల మధ్యన విభేదాలే తప్ప, హీరోలెప్పుడూ తామంతా తెలుగు కళామతల్లి బిడ్డలమేనని భావిస్తారు. అందుకే ‘బాహుబలి ది కంక్లూజన్‌’ సినిమాని తమ సినిమాగా భావించారు.

ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ స్థాయికి, అంతకు మించిన స్థాయికి ఎదగడం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణం. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి, చిన్న నటుడిదాకా ప్రతి ఒక్కరూ ‘బాహుబలి’పై ప్రశంసలు కొనసాగిస్తున్నారు. తమిళ, కన్నడ, మలయాళ నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులూ ‘బాహుబలి’కి ‘సాహోరే’ అంటుండడం అభినందనీయం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular