HomeMovie News Teluguహద్దులు చెరిపేసిన బాహుబలి: రామ్‌చరణ్‌

హద్దులు చెరిపేసిన బాహుబలి: రామ్‌చరణ్‌

‘బాహుబలి’ సినిమా బాక్సాఫీస్‌ హద్దుల్ని చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించేస్తోంది. ఇండియాలో ఇప్పటికే రికార్డు వసూళ్ళను సొంతం చేసుకున్న ‘బాహుబలి’ ఓవర్సీస్‌లో కూడా అదే స్థాయిలో రికార్డులు సృష్టిస్తుండగా, ఈ సినిమాకి ఇంటా బయటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ‘బాహుబలి’ని చూశాడు. సినిమా అత్యద్భుతంగా ఉందని, ఓ గొప్ప సినిమా వసూళ్ళ హద్దుల్ని చెరిపేస్తుందనడానికి ‘బాహుబలి’ సాక్షిగా నిలిచిందని చెప్పాడు.

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా ‘బాహుబలి’ సినిమా విజయాన్ని అభివర్ణించాడు చరణ్‌. ‘బాహుబలి’ని చరణ్‌తోపాటు మెగాస్టార్‌ చిరంజీవి కూడా చూశారు. ఓ మంచి సినిమా ఇంతటి అద్భుత విజయం సాధించడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన చెప్పారు. ఇంకో వైపున చరణ్‌, ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ నటన అత్యద్భుతమని కొనియాడాడు. భళ్ళాలదేవుడు తన స్నేహితుడు రానా కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, మంగళవారం కూడా ‘బాహుబలి’ జోరు కొనసాగుతోంది.

అన్ని థియేటర్ల దగ్గరా హౌస్‌ఫుల్‌ బోర్డ్స్‌ దర్శనమిస్తున్నాయి. మామూలుగా వీకెండ్‌లోనే సినిమాలకి హౌస్‌ ఫుల్స్‌ ఉంటాయి. కానీ ఈ సినిమాకి సెలవులతో సంబంధం లేకుండా ఆక్యుపెన్సీ ఉండడం విశేషం. అదే ‘బాహుబలి’ సినిమా గొప్పతనం. భాషతో సంబంధం లేకుండా ప్రముఖులందరి ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular