HomeMovie News Teluguకమల్‌ రెండో విశ్వరూపం ఎప్పుడు?

కమల్‌ రెండో విశ్వరూపం ఎప్పుడు?

‘విశ్వరూపం-2’ సినిమా ఫస్ట్‌ లుక్‌ని తీసుకొచ్చాడు విశ్వనటుడు కమల్‌హాసన్‌. నటుడిగా ఎన్నో సినిమాల్లో నట విశ్వరూపం ఇప్పటికే చూపించేశాడాయన. అయినా ఇంకా ఏదో కొత్తగా చేయాలన్న ఆయన తపనకు హేట్సాఫ్‌ చెప్పాలి. అయితే కమల్‌ సినిమాలు అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావు. ఏదో ఒక వివాదం ఆయన సినిమాల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అదే విధంగా ‘విశ్వరూపం’ సినిమా విషయంలోనూ పలు వివాదాలు తలెత్తాయి.

ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘విశ్వరూపం-2’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంతవరకూ విడుదల కాలేదు. ఈలోగా కమల్‌ ‘శభాష్‌నాయుడు’ చిత్రాన్ని సీన్‌లోకి తెచ్చాడు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సినిమా నిర్మాణానికే చాలా టైం తీసుకుంది. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌తో పాటు, కమల్‌ తనయ శృతిహాసన్‌ కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా, అప్పుడెప్పుడో విడుదల కావాల్సిన ‘విశ్వరూపం-2’ అనుకోకుండా ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది.

2017లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని కమల్‌ చెప్పాడు. అంటే విడుదలపై ఇంకా స్పష్టత లేదన్నమాట. అదలా ఉంచితే తాజాగా వచ్చిన ‘విశ్వరూపం-2’ ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ దాకా ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. భారీ బడ్జెట్‌తో కమల్‌ రూపొందించిన చిత్రమిది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular