HomeMovie News Teluguపూరి జగన్నాధ్ కి గుడి కట్టేశారు!

పూరి జగన్నాధ్ కి గుడి కట్టేశారు!

హీరోలకి, హీరోయిన్స్ కి గుడి కట్టి తమఅభిమానం చాటుకోవడం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా సౌత్ ఇండియా లో ఇది చాలా మాములైన విషయంగా చూస్తాము.

అయితే ఇంతవరకు ఒక దర్శకుడికి గుడి కట్టిన సందర్భాలు లేవు అనే చెప్పొచు! వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని కొండాపూర్ గ్రామంలో దర్శకుడు పూరి జగన్నాధ్ విగ్రహం కట్టారు.

ఇది లోకల్ గా ఉన్న పూరి జగన్నాధ్ అభిమానులు ఈ విగ్రహాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని పూరి తనయుడు ఆకాష్ పూరి సందర్శించాడు. ఇక హిట్స్ ఫ్లాప్స్ అనే తేడా లేకుండా పూరి జగన్నాధ్ చిత్రాలని తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తుంటారు.

ఎంతోమంది డైరెక్టర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు కాని ఈ డాషింగ్ డైరెక్టర్ పూరికి ఫాలోయింగ్ ఒక హీరోకి ఉన్న స్థాయిలో ఉంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.

మరి దీని పై పూరి ఎలా స్పందిస్తాడో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular