HomeMovie News Teluguబాహుబలి 2కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన పవన్ కళ్యాణ్

బాహుబలి 2కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎందుకంటె, పవన్ కి ఫాలోయింగ్ మనం తరుచూ ఆడియో ఫంక్షన్లలో చూస్తూనే ఉంటాము.

అయితే దీన్ని మాత్రం బాహుబలి 2 కథా రచయత అయిన విజయేంద్రప్రసాద్ ఇంకొక కోణంలో చూశారు. బాహుబలి 2లో ఇంటర్వెల్ సమయంలో వచ్చే సన్నివేశం గురించే సినిమా చూసిన అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ సీన్ రాయడం వెనుక జరిగిన కథని ఆయన చెప్పారు.

విషయంలోకి వస్తే, బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ ఎలా రాయాలో అని ఆలోచిస్తున్న సమయంలో  విజయేంద్రప్రసాద్ ఓ ఆడియో ఫంక్షన్ చూసారట. అందులో పవన్ కళ్యాణ్ లేకపోయినా, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన పేరుని పిలవడం ఈ సన్నివేశం రాయడానికి స్ఫూర్తి అట.

అయితే ఇప్పటికే బాహుబలి 2 చిత్రం చూసినవారికి ఆ సన్నివేశం గురించి ఇప్పటికే అర్ధమవుతుంది. ఇక చూడనివారు మాత్రం తాము చూసినప్పుడు బాహుబలి2 ఇంటర్వెల్ కి పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కి సంబంధం ఇట్టే తెలిసిపోతుంది.

మొత్తానికి పవన్ ఫాలోయింగ్ బాహుబలి 2 పైన కూడా పడింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular