HomeMovie News Teluguఅర్జున్‌ విత్‌ అల్లు అర్జున్‌

అర్జున్‌ విత్‌ అల్లు అర్జున్‌

సీనియర్‌ నటుడు అర్జున్‌ మళ్ళీ తెలుగు తెరపై హల్‌చల్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. నితిన్‌ హీరోగా రూపొందుతోన్న ‘లై’ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చిన అర్జున్‌, ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసినదే. విదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు కాగా, నితిన్‌తో కలిసి గతంలో ‘శ్రీఆంజనేయం’ సినిమాలో అర్జున్‌ నటించాడు. తాజా గాసిప్‌ ఏమిటంటే అర్జున్‌ మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పాడట.

అది కూడా అల్లు అర్జున్‌ సినిమా కావడం సంచలనంగా ఉంది. అల్లు అర్జున్‌తో అర్జున్‌ గతంలోనే ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో అప్పట్లో ఆ అవకాశాన్ని అర్జున్‌ వదులుకున్నాడని సమాచారమ్‌. రామ్‌ హీరోగా రూపొందిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాలో అర్జున్‌ ఓ కీలక పాత్రలో నటించినప్పటికీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై ఇతర భాషలకు చెందిన సీనియర్‌ నటులు సత్తా చాటుతుండడంతో అర్జున్‌ కూడా మనసు మార్చుకున్నాడట.

యాక్షన్‌ కింగ్‌గా పేరొందిన అర్జున్‌ తెలుగు ప్రేక్షకుల్ని కూడా చాలా సినిమాలతో అలరించాడు. ఇంతకీ అల్లు అర్జున్‌తో అర్జున్‌ నటించబోయే సినిమా ఏంటో తెలుసా? అదే వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించే సినిమా. అయితే ఇందులో అర్జున్‌ విలన్‌గా నటించే అవకాశాలున్నాయట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular