HomeMovie News Teluguవచ్చేసింది 'బాహుబలి' పండగ

వచ్చేసింది ‘బాహుబలి’ పండగ

గత రెండేళ్లుగా ఎదురు చూస్తోన్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ పండగ రానే వచ్చింది. తొలి పార్ట్‌ వీక్షించిన ప్రతీ ఒక్కరూ రెండో పార్ట్‌ని చూడాలనే ఉత్కంఠతో ఉన్నారు. అదే ఈ సినిమాకి ఇంత హైప్‌ పెరగడానికి కారణం అయ్యింది. ఇంకేముంది సినిమా ధియేటర్స్‌లోకి రానే వచ్చింది. ఒక్క ప్రబాస్‌ ఫ్యాన్సే కాదు, సినీ ప్రియులంతా ఈ సినిమాని పండగ చేసుకుంటున్నారు. హైద్రాబాద్‌లోని భ్రమరాంబ ధియేటర్లో ‘బాహుబలి’ టీమ్‌ సందడి చేసింది. డైరెక్టర్‌ రాజమౌళి, అనుష్క తదితరులు సినిమాని వీక్షించారు. వారిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. సినిమాని ఇంత సక్సెస్‌ చేసినందుకు రాజమౌళి అభిమానులకు అభివాదం తెలిపారు. మరో పక్క నేషనల్‌ మీడియా కూడా ‘బాహుబలి’ సినిమాని బాగా కవర్‌ చేస్తోంది.

ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి గౌరవం దక్కడం అంటే చిన్న విషయం కాదు. భారతీయులంతా గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా ఇది. గ్రాఫిక్స్‌ విషయంలో హాలీవుడ్‌ రేంజ్‌ని అందుకొనేంత గొప్పగా ఉందని టాక్‌ వినిపిస్తోంది. ఎలా ఈ సినిమాని రాజమౌళి డీల్‌ చేస్తాడా అని వెయిట్‌ చేశారు ఈ సినిమా తొలి పార్ట్‌ చూసిన వాళ్లంతా. కానీ రాజమౌళి పార్ట్‌ 2ను టేకప్‌ చేసిన విధానం చూసి భళా రాజమౌళి భళా అనకుండా ఉండలేకపోతున్నారు. అలాగే ప్రబాస్‌, అనుష్క, రానా తదితర తారాగణం స్క్రీన్‌పై చూపించిన ప్రతిభకి ఫిదా కాక తప్పడం లేదు. టోటల్‌గా ‘బాహుబలి’ కి కన్‌క్లూజన్‌ అదిరిపోయిందబ్బా! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular