HomeMovie News Teluguసోషల్‌ మీడియాకి 'బాహుబలి' మేనియా

సోషల్‌ మీడియాకి ‘బాహుబలి’ మేనియా

ఎన్నాళ్లగానో ఎదురు చూస్తోన్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. గత కొంత కాలంగా ‘బాహుబలి’ మేనియా ఏ రకంగా ఉందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిన్నటి నుండి ఈ మేనియా మరింత రెట్టింపయ్యింది. ఎటు చూసినా ‘బాహుబలి’ పేరు మార్మోగిపోతోంది. నిన్న ప్రీమియర్‌ షోలు పడ్డాక అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. సోషల్‌ మీడియాలో అరతా ‘బాహుబలి’తోనే నిండిపోయింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం అనే తేడా లేదు.

టోటల్‌ సోషల్‌ మీడియా ఒక్కటే సందడి. ‘బాహుబలి’ సినిమా చూస్తానని కొంతమంది, చూస్తున్నానని కొంతమంది సినిమాతో దిగిన సెల్ఫీలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అక్కినేని అఖిల్‌ కూడా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాని చూస్తూ ధియేటర్లో టైటిల్స్‌ పడుతున్నప్పుడు తీసుకున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఇలా ఒక్కరేమిటి, సామాన్య ప్రజలు, సెలబ్రిటీస్‌ అనే తేడా లేదు.

ప్రతీ ఒక్కరూ బాహుబలిపై తమ అభిమానాన్ని పలు రకాలుగా ప్రదర్శిస్తున్నారు. తెలుగు సినిమాకే ‘బాహుబలి’ అనేది ఓ పెద్ద గిఫ్ట్‌ అని అఖిల్‌ అన్నాడు. అలాగే ఇతర హీరోలు, హీరోయిన్లు కూడా బాహుబలి సినిమా పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏది ఏమైనా అనుకున్న అంచనాలను ‘బాహుబలి’ రీచ్‌ అయ్యిందనే సంగతి ఈ ఓపెనింగ్స్‌ చూస్తుంటేనే అర్ధమవుతోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular