HomeMovie News Teluguపవన్‌తో టచ్‌లోనే ఉన్నాడట

పవన్‌తో టచ్‌లోనే ఉన్నాడట

తమిళ డైరెక్టర్‌ ఎస్‌.జె.సూర్య – పవన్‌ కళ్యాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలుకొట్టింది. అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘కొమరం పులి’ ఒక వర్గం ప్రేక్షకుల్ని అలరించకపోయినా, ఫర్వాలేదనిపించింది. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ‘ఖుషి’ రేంజ్‌లో మొదలయ్యాయి. అయితే చివరి నిమిషంలో ఈ కాంబినేషన్‌ నుండి ఎస్‌.జె.సూర్య తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి వచ్చి చేరాడు దర్శకుడు డాలీ.

నిజానికి పవన్‌తో ఎస్‌.జె.సూర్య అనుకున్న సబ్జెక్ట్‌ వేరు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన సబ్జెక్ట్‌ వేరు. డైరెక్టర్‌ ఛేంజ్‌ కావడంతో పవన్‌ ‘వీరమ్‌’ రీమేక్‌కు సై అనడం, ‘కాటమరాయుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా నిరాశపరచడం అలా అలా జరిగిపోయాయి. అయితే ఎస్‌.జె.సూర్య – పవన్‌ కాంబినేషన్‌లో ప్రిపేర్‌ అయిన సబ్జెక్ట్‌ని త్వరలోనే పట్టాలెక్కించేయనున్నారట. పవన్‌తో సూర్య టచ్‌లోనే ఉన్నాడట. సూర్య విలన్‌గా నటిస్తున్న ‘స్పైడర్‌’ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కేయనుందని సమాచారమ్‌. మరో పక్క పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం త్రవిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఎస్‌.జె.సూర్య సినిమా స్టార్ట్‌ కానుందని తాజా సమాచారమ్‌. మొత్తానికి పవన్‌ మాత్రం ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సినిమా సినిమాకీ లాంగ్‌ గ్యాప్‌ తీసుకునే పవర్‌ స్టార్‌ అస్సలు గ్యాపే లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘కాటమరాయుడు’ లోటును త్రివిక్రమ్‌ సినిమా తీర్చనుందని ఫ్యాన్స్‌ గంపెడు ఆశతో ఉన్నారు. ఈ సినిమాలో పవన్‌తో అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ జత కడుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular