HomeMovie News Teluguచైతూ, సమంత పెళ్ళెప్పుడంటే

చైతూ, సమంత పెళ్ళెప్పుడంటే

అక్కినేని నాగచైతన్య, సమంత త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారట. అక్టోబర్‌లో వీరి పెళ్ళి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారమ్‌. నాగచైతన్య తండ్రి నాగార్జున పెళ్ళి ఏర్పాట్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినవస్తున్నాయి. మొన్నీమధ్యనే నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం కూడా జరిగింది. ‘ఏ మాయ చేశావె’ సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. తెలుగులో సమంతకి అదే తొలి సినిమా.

తొలి సినిమాతోనే ఈ జంట ప్రేక్షకుల్ని మాయలో ముంచేసింది. ఆ తర్వాత నాగచైతన్య, ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాలో సమంతతో కలిసి నటించాడు. అలా వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. అయితే, ఇద్దరి మధ్యా ప్రేమ గురించి ఈ మధ్యనే అధికారిక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన తర్వాత సోషల్‌ మీడియాలో తమ ప్రేమ బంధం గురించి పదే పదే సమంత వెల్లడిస్తూ రావడం, అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేసింది.

ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఇద్దరూ వివిధ ప్రదేశాల్లో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేసిన ఫొటోల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంత సెన్సేషన్‌ అయిన సమంత – నాగచైతన్యల పెళ్ళి వార్త త్వరలోనేనన్న విషయం అక్కినేని అభిమానుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తేదే. ఆన్‌ స్క్రీన్‌ జంట, రియల్‌ లైఫ్‌లో భార్యా భర్తలుగా మారడం విశేషమే కదా. నాగార్జున, అమల కూడా ప్రేమించే పెళ్ళి చేసుకున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular