HomeMovie News Teluguసమంత చూపులు - వంద ప్రశ్నలు

సమంత చూపులు – వంద ప్రశ్నలు

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, ఓ ఫొటోతో ఇప్పుడందర్నీ షాక్‌కి గురిచేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో సమంత పెద్ద మెసేజ్‌ ఇచ్చింది. అమ్మాయి కళ్ళలోకి తొంగి చూస్తే, ఆమె మనసులో ఏముందో తెలుస్తుంది. అలా అమ్మాయి కళ్ళలోకి చూసి, మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోగలగడమే అసలైన అందం అని ఆమె చెప్పిన మాట చాలా చాలా గొప్పగా ఉందని చెప్పక తప్పదు.

అయితే సమంత కళ్ళలోకి తొంగి చూస్తే, ఆమె మనసులో ఏముందో తెలిసిందా? అని సోషల్‌ మీడియాలో పలువురు ఆ ఫొటోపై కామెంట్స్‌ వేస్తున్నారు. బాధలో ఉందా? ఎవరికోసం అయినా ఎదురుచూస్తోందా? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఫొటోలో తీక్షణత అంత ఎక్కువగా ఉంది. ఫొటోగ్రాఫర్‌ గొప్పతనం, అలాగే సమంత కళ్ళలో పండించిన ఎక్స్‌ప్రెషన్‌ అన్నీ సూపర్బ్‌. నటిగా సమంత కెరీర్‌లో అత్యున్నత శిఖరాల్ని చవిచూసేసింది.

ప్రస్తుతం చరణ్‌తో ఓ సినిమా చేస్తోంది. అలాగే ‘రాజుగారి గది-2’ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. కొన్ని తమిళ సినిమాలకు కూడా కమిట్‌ అయ్యింది. అయితే సమంత పోస్ట్‌ చేసిన ఫొటో దేనికి సంబంధించినదో తెలియరావడంలేదు. ఏదేమైనప్పటికీ ఒక్క ఫొటోతోనే సమంత వంద ప్రశ్నలకు ఆస్కారమిచ్చిందంటేనే ఆ ఫొటో గొప్పతనం ఏంటో అర్థమవుతుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular