HomeMovie News Teluguసూపర్‌ స్టార్‌ 'స్పైడర్‌' సింప్లీ సూపర్బ్‌

సూపర్‌ స్టార్‌ ‘స్పైడర్‌’ సింప్లీ సూపర్బ్‌

చేతిలో గన్నుతో సూపర్‌ ఫిట్‌ ఫిజిక్‌తో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘స్పైడర్‌’ అంటూ ఫస్ట్‌ లుక్‌తో వచ్చేశాడు. ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ అదిరిపోయిందని అభిమానులు సంబరాలు స్టార్ట్‌ చేసేశారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌జె సూర్య ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండడం మరో విశేషం. ‘బ్రహ్మూెత్సం’ సినిమా టైమ్‌లో మహేష్‌తో నటించే ఛాన్స్‌ మిస్‌ అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఈ ‘స్పైడర్‌’లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

 ‘స్పైడర్‌’లో మహేష్‌ క్యారెక్టర్‌ విషయానికొస్తే గూఢచారిలా కనిపించబోతున్నాడట. ‘స్పైడర్‌’ టైటిల్‌ వెనుక అర్థం ఇదేనట. ‘స్పై’డర్‌ అన్నమాట. అయితే టైటిల్‌లో అలాంటి కన్‌ఫ్యూజన్‌ ఏమీ క్రియేట్‌ చేయలేదు. ముందుగా ఈ సినిమా కోసం ‘సంభవామి’ అనే టైటిల్‌ని అనుకున్నారుగానీ, చివరికి ‘స్పైడర్‌’ని ఫిక్స్‌ చేశారు. ఎన్‌విఆర్‌ సినిమా పతాకంపై ఈ ‘స్పైడర్‌’ రూపొందుతోంది. ద్విభాషా చిత్రంగా మురగదాస్‌ ఈ ‘స్పైడర్‌’ని రూపొందిస్తున్నాడు. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఈ సినిమా ఒకేసారి విడుదలవుతుంది. దాదాపు మూడున్నర నెలల నుంచి ఇదిగో అదిగో అంటూ అభిమానుల్ని ఊరించిన ఫస్ట్‌ లుక్‌ వచ్చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular