HomeMovie News Telugu2 కోట్లు - ఇది మరీ టూమచ్‌

2 కోట్లు – ఇది మరీ టూమచ్‌

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరంటే రజనీకాంత్‌ పేరే చెబుతారు. అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ వంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోస్‌ కన్నా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెమ్యునరేషనే ఎక్కువ. కానీ రజనీకాంత్‌ని ఓ బాలీవుడ్‌ హీరో రెమ్యునరేషన్‌లో దాటేశాడట. అతనే అక్షయ్‌కుమార్‌. రోజుకి 2 కోట్ల చొప్పున అక్షయ్‌కుమార్‌ రోబో 2.0 సినిమా కోసం అందుకున్నాడని సమాచారమ్‌. ఇది గనుక నిజమైతే ‘చాలా చాలా టూమచ్‌’ అనుకోవాల్సి వస్తుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌కి ధీటుగా అక్షయ్‌కుమార్‌ పాత్ర ఉంటుందని అందరికీ తెలుసుగానీ, రెమ్యునరేషన్‌లోనూ రజనీకాంత్‌తో పోటీ పడటమంటే చిన్న విషయం కాదు.

పోటీ పడటం అలా ఉంచితే, అంతకన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకోవడం చాలా గొప్ప విషయం. హీరోతో సమానంగా విలన్‌కి రెమ్యునరేషన్‌ ఇస్తే, సినిమా నిర్మాణం కోసం ఇంకెంత ఖర్చు చేసి ఉంటారో కదా? 400 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇండియాలోనే అత్యంత భారీ ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కుతోందని మాత్రం నమ్మాల్సిందే. అంత గ్రాండ్‌గా ఈ సినిమాని దర్శకుడు శంకర్‌ రూపొందిస్తున్నారు. హీరోయిన్‌ అమీ జాక్సన్‌ కూడా ఈ సినిమాతో రికార్డ్‌ స్థాయి రెమ్యునరేషన్‌ అందుకుంటోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular