HomeMovie News Teluguఅవునా, సమంత అలాంటి పాత్రలోనా?

అవునా, సమంత అలాంటి పాత్రలోనా?

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌ మీదకు వెళ్ళింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారిగా సమంత చరన్‌తో జతకడుతోంది ఈ సినిమాలో. సమంత ఇప్పటిదాకా రామ్‌చరణ్‌తో కలిసి సినిమా చేయలేదు. అయితే తాజా గాసిప్‌ ప్రకారం ఈ చిత్రంలో సమంత మూగ యువతి పాత్రలో కనిపించనుందని సమాచారమ్‌.

అలాగే చరణ్‌, వినికిడి లోపంతో బాధపడే యువకుడిగా కనిపించనున్నాడన్న గాసిప్స్‌ వినవస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్‌ పట్ల ఇంకా స్పష్టత లేదు. కానీ ఈ సినిమా స్టోరీ అయితే విభిన్నమైనదనే తెలుస్తోంది. ఓ ప్రయోగాత్మక చిత్రం అని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకూ రామ్‌ చరణ్‌ పాత్రే ఈ సినిమాలో విభిన్నంగా ఉండబోతోందని చర్చించుకున్నారంతా. కానీ తాజాగా హీరోయిన్‌ పాత్ర కూడా విభిన్న తరహాలో ఉండబోతోందన్న గాసిప్‌ అయితే ప్రస్తుతం హాట్‌ హాట్‌గా చక్కర్లు కొడుతోంది.

ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని సోషల్‌ మీడియాలో పంచుకునే సమంత తాజా సినిమాకి సంబంధించి, షూటింగ్‌లో తాను పాల్గొంటున్న విషయాన్ని, ఫొటోల ద్వారా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. గోదావరి అందాల్ని చూసి సమంత మురిసిపోతోందట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular