HomeMovie News Telugu'జై లవ కుశ' టైటిల్‌ వచ్చేసిందోచ్‌

‘జై లవ కుశ’ టైటిల్‌ వచ్చేసిందోచ్‌

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ టైటిల్‌ వచ్చేసింది. ఎన్టీయార్‌ హీరోగా ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నాడు. ఇందులో ఎన్టీయార్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసినదే కదా. రాశి ఖన్నా ఓ హీరోయిన్‌గా నటిస్తుంటే, ఇంకో హీరోయిన్‌గా నివేదా థామస్‌ పేరు పరిశీలనలో ఉంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎన్టీయార్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారమ్‌.

శ్రీరామనవమి పర్వదినాన అలనాటి పౌరాణిక అద్భుతం ‘లవకుశ’ తరహాలోనే ‘జై లవ కుశ’ టైటిల్‌ని విడుదల చేయడం గమనించదగ్గది. టైటిల్‌ డిజైనింగ్‌ అలనాటి ‘లవ కుశ’ని తలపించింది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, అలాగే మోషన్‌ పోస్ఱర్‌ కూడా వచ్చాయి. అయితే తమ అభిమాన హీరో లుక్‌ కూడా రివీల్‌ అవుతుందని అభిమానులు ఆశించారుగానీ, చిత్ర యూనిట్‌ వారి ఆశలపై కొంత మేర నీళ్ళు చల్లినట్లుగా ఉంది. సినిమాలో ఎన్టీయార్‌ లుక్‌ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు.

అందుకే టైటిల్‌ తప్ప ఎన్టీయార్‌ లుక్‌ని రివీల్‌ చేయలేదు. ఎన్టీయార్‌ లుక్‌ రివీల్‌ చేయడానికి ఇంకో మంచి ముహూర్తాన్ని త్వరలో ఖరారు చేస్తారని సమాచారమ్‌. అన్నయ్య నిర్మాతగా తమ్ముడు హీరోగా అలనాటి ‘లవకుశ’ని తలపించేలా ‘జై లవ కుశ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కళ్యాణ్‌ రామ్‌ నిర్మాతగా ఎన్టీయార్‌ హీరోగా వస్తున్న ఈ కాంబినేషన్‌ తెలుగు సినీ పరిశ్రమ గత రికార్డుల్ని తిరగరాస్తుందని ఆశిద్దాం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular