HomeMovie News Telugu'సైరా' రికార్డుల హోరుకు రంగం సిద్ధం.

‘సైరా’ రికార్డుల హోరుకు రంగం సిద్ధం.

చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి‘ ఈ రోజు వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కోసం అన్ని వర్గాల వారూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ యుఎస్‌ ప్రీమియర్స్‌ నుండి అందిన సమాచారంతో సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని టాక్‌ స్ప్రెడ్‌ అయిపోయింది. బాలీవుడ్‌ నుండి ఈ సినిమాకి మంచి రివ్యూలు వస్తున్నాయి.

టాక్‌ ఇంత పోజిటివ్‌గా ఉండడంతో, సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. ఇదిలా ఉంటే, పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ఎక్స్‌ట్రా షోస్‌కి మన ప్రభుత్వాలు అనుమతిస్తుండడం సాంప్రదాయంగా వస్తున్న పద్ధతే. అయితే, ‘సైరా’కి ఆ అనుమతులు నిరాకరించబడ్డాయి అనే ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదనీ, ఏపీ ప్రభుత్వం ‘సైరా’ ఎక్స్‌ట్రా షోలకు అనుమతిచ్చిందనీ తెలుస్తోంది. సో ఎక్స్‌ట్రా షోలకు లైన్‌ క్లియర్‌ అయినట్లే. అర్ధరాత్రి 1 గంట నుండి ఉదయం 10 గంటల వరకూ అదనంగా షోలు నిర్వహించుకోవచ్చనీ, అక్టోబర్‌ 2 నుండి 8 వరకూ అంటే వారం రోజుల పాటు ఈ అదనపు షోల ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.

ఇక ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి..’ అనే రేంజ్‌లో మెగాస్టార్‌ బాక్సాఫీస్‌ బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోయారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటించారు. బిగ్‌బీ అమితాబ్‌తో సహా, అనుష్క, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular